టీమిండియాలో స్వార్థం లేని వ్యక్తి అతడే.. అందుకే వాటిల్లో వెనకపడ్డాడు: గంభీర్

  • Author Soma Sekhar Updated - 06:14 PM, Wed - 6 December 23

ఎప్పుడూ ధోని, విరాట్ కోహ్లీలను విమర్శిస్తూ.. వార్తల్లో నిలిచే గంభీర్ మరోసారి తన నర్మగర్భ వ్యాఖ్యలతో హాట్ టాపిక్ గా మారాడు. భారత జట్టులో అతడే నిస్వార్థపరుడైన ప్లేయర్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ఎప్పుడూ ధోని, విరాట్ కోహ్లీలను విమర్శిస్తూ.. వార్తల్లో నిలిచే గంభీర్ మరోసారి తన నర్మగర్భ వ్యాఖ్యలతో హాట్ టాపిక్ గా మారాడు. భారత జట్టులో అతడే నిస్వార్థపరుడైన ప్లేయర్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

  • Author Soma Sekhar Updated - 06:14 PM, Wed - 6 December 23

వరల్డ్ కప్ లో టీమిండియా ఫుల్ స్వింగ్ లో ఉంది. ఆడిన 5 మ్యాచ్ ల్లో 5 గెలిచి.. సెమీస్ రేసులో ముందుంది. ఇక జట్టులో ఉన్న ప్లేయర్లందరూ సమష్టిగా రాణిస్తూ.. విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలో జట్టు సభ్యుల్లో ఓ ఆటగాడిపై ప్రశంసల వర్షం కురిపించాడు టీమిండియా మాజీ ఆటగాడు, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్. ఎప్పుడూ ధోని, విరాట్ కోహ్లీలను విమర్శిస్తూ.. వార్తల్లో నిలిచే గంభీర్ మరోసారి తన నర్మగర్భ వ్యాఖ్యలతో హాట్ టాపిక్ గా మారాడు. భారత జట్టులో అతడే నిస్వార్థపరుడైన ఆటగాడు. అందుకే అతడి ఖాతాలో తగినన్ని శతకాలు లేవు అంటూ పరోక్షంగా కింగ్ విరాట్ కోహ్లీని విమర్శించాడు గంభీర్. మరి గంభీర్ చెప్పిన ఆ నిస్వార్థ ప్లేయర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

గౌతమ్ గంభీర్.. ఎప్పుడు ఎవరిమీదో ఒకరి మీద కామెంట్స్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు. ఎక్కువగా మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీలపై విమర్శలు చేస్తుంటాడు. కొన్ని సార్లు డైరెక్ట్ గా విమర్శిస్తే.. మరికొన్ని సార్లు పరోక్షంగా తన నోటికి పనిచెబుతుంటాడు ఈ మాజీ ప్లేయర్. తాజాగా మరోసారి తన నర్మగర్భ వ్యాఖ్యలతో క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాడు. స్టార్ స్పోర్ట్స్ మీడియాతో మాట్లాడుతూ..”టీమిండియాలో నిస్వార్థమైన క్రికెటర్ ఎవరైనా ఉన్నారంటే? అది రోహిత్ శర్మ అని నా అభిప్రాయం. ఎందుకంటే అతడు క్రికెట్ కెరీర్ ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు వన్డేల్లో 40 నుంచి 45 సెంచరీలు ఉండేవి. కానీ అతడికి శతకాల మోజులేదు, వ్యక్తిగత రికార్డుల ఆలోచన లేదు. అందుకే అతడు సెంచరీల్లో వెనకపడ్డాడు. నా దృష్టిలో జట్టులో అతడే నిస్వార్థపరుడు” అంటూ పరోక్షంగా విరాట్ కోహ్లీని టార్గెట్ చేస్తూ మాట్లాడాడు.

ప్రస్తుతం రోహిత్ శర్మ వన్డేల్లో 31 సెంచరీలు చేశాడు. ఇక టెస్టుల్లో 10 శతకాలు చేశాడు. ఇదే టైమ్ లో విరాట్ కోహ్లీ వన్డేల్లో 48 సెంచరీలు బాది సచిన్ రికార్డును బద్దలు కొట్టేందుకు సిద్దమైయ్యాడు. రోహిత్ వ్యక్తిగత రికార్డుల కోసం కాకుండా.. జట్టు విజయాల కోసం చూస్తాడని గంభీర్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం గంభీర్ వ్యాఖ్యలు క్రీడా ప్రపంచంలో వైరల్ గా మారాడంతో.. మరోసారి కోహ్లీపై తన కోపం వెళ్లగక్కాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి టీమిండియాలో రోహిత్ శర్మ నిస్వార్థపరుడు అన్న గంభీర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments