OTT Suggestions- Best Comedy Drama: దేశం మొత్తం OTTలో ఈ సినిమా కోసం పడి చచ్చిపోతున్నారు.. ఇంకా చూడలేదా?

దేశం మొత్తం OTTలో ఈ సినిమా కోసం పడి చచ్చిపోతున్నారు.. ఇంకా చూడలేదా?

OTT Suggestions- Top Trending Comedy Thriller Movie: ఓటీటీలో ఇప్పుడు ఒక సినిమా పాన్ ఇండియా లెవల్లో ట్రెండ్ అవుతోంది. అయితే చాలామంది ఈ మూవీని ఇంకా చూసినట్లు లేరు. అయితే ఒక మంచి కామెడీ థ్రిల్లర్ డ్రామాని మీరు మిస్ అయినట్లే. అయితే అసలు ఆ సినిమా ఏదో చూడండి.

OTT Suggestions- Top Trending Comedy Thriller Movie: ఓటీటీలో ఇప్పుడు ఒక సినిమా పాన్ ఇండియా లెవల్లో ట్రెండ్ అవుతోంది. అయితే చాలామంది ఈ మూవీని ఇంకా చూసినట్లు లేరు. అయితే ఒక మంచి కామెడీ థ్రిల్లర్ డ్రామాని మీరు మిస్ అయినట్లే. అయితే అసలు ఆ సినిమా ఏదో చూడండి.

ఓటీటీలోకి చాలానే సినిమాలు వస్తూ ఉంటాయి.. పోతూ ఉంటాయి. కొన్ని సినిమాలు వచ్చిన సంగతి కూడా ఎవరికీ తెలియదు. కానీ, కొన్ని సినిమాలు మాత్రం ఓటీటీ ఆడియన్స్ మీద గట్టి ప్రభావం చూపుతాయి. అది ఎంతా అంటే దేశం మొత్తం ఆ సినిమా గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సినిమా చూసేందుకు పరితపిస్తూ ఉంటారు. అలాంటి ఒక సినిమా ఇప్పుడు దేశాన్ని షేక్ చేస్తోంది. అంతేకాకుండా.. ఈ మూవీ కోసం ఆడియన్స్ పడి చచ్చిపోతున్నారు. అసలు ఆ మూవీ అంతలా ఎందుకు వైరల్ అవుతోంది? అంత సెన్సేషన్ క్రియేట్ చేసే అంత ఆ సినిమాలో ఏం ఉందో చూద్దాం.

కొన్ని సినిమాలు ఓటీటీల్లో చేసే హంగామా అంతా ఇంతా కాదు. అవి వచ్చినప్పటి నుంచి కనీసం కొన్నేళ్లపాటు తమ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. అలాంటి ఒక సినిమా గురించే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ప్రముఖ ఓటీటీలో ఇది పాన్ ఇండియా లెవల్లో టాప్ 3లో కొనసాగుతోంది. దేశం మొత్తం అన్ని రకాల భాషలు, అన్ని సినిమాలు ఉండగా.. ఇది టాప్ 3లో కొనసాగుతోంది అంటే సామాన్య విషయం కాదు. అంతలా ఆ సినమాలో ఏం ఉంది అని కంగారు పడకండి. ఇది చాలా సింపుల్ స్టోరీ. ఇందులో పెద్ద ఇరకాటంలో పడేసే విషయం కూడా ఏం ఉండదు. కాకపోతే రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే ఈ సినిమాకి ఇప్పుడు అంత క్రేజ్.

సాధారణంగా ప్రతి ఒక్కరికి బెస్ట్ ఫ్రెండ్స్, చైల్డ్ హుడ్ బడీస్ ఉంటారు. అలాగే ఈ సినిమా కూడా ముగ్గురు చెడ్డీ దోస్తుల మధ్య జరిగే కథ. అలాగని ఇది పెద్ద కథ కూడా కాదు. చాలా సింపుల్ గా సాగిపోతుంది. ఒక ముగ్గురు దోస్తులు చాలా ఏళ్ల తర్వాత కలుస్తారు. అయితే అప్పుడు వాళ్లు గోవా ట్రిప్పుకు పోవాలి అని ఫిక్స్ అవుతారు. చిన్నప్పటి కలను పెద్దయ్యాక అయినా తీర్చుకోవాలి అని తాపత్రయ పడుతూ ఉంటారు. అంతా అప్పటికి బాగానే ఉన్నా కూడా.. ఆ ట్రిప్పు మాత్రం నానా మలుపులు తిరుగుతుంది. మధ్యలోకి గన్నులు, ఛేజింగ్లు, భారీ భారీ యాక్షన్ సీక్వెన్సులు కూడా వస్తాయి. ఈ మూవీ కథలోకి వెళ్లే కొద్దీ బాగా అడిక్ట్ అయిపోతారు.

ఇంక ఈ సినిమాలో ఇంకో బెస్ట్ పార్ట్ కూడా ఉంటుంది. అదేంటంటే.. ఇందులో ఉండే కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ ముగ్గురు హీరోలు వేసే పంచులు, కంగారులో కూడా వాళ్లు చేసే కామెడీ కచ్చితంగా ఆకట్టుకుంటుంది. మొత్తానికి ఈ మూవీ మాత్రం ఒక ఫన్నీ రైలు ప్రయాణంలాగా ఉంటుంది. ఈ సినిమా పేరు మరేంటో కాదు.. మద్గావ్ ఎక్స్ ప్రెస్. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి.. ఇప్పటి దాకా మీరు ఈ సినిమా చూడకపోతే వెంటనే చూసేయండి. కాకపోతే హిందీలో ఉంది. అయినా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి.

Show comments