OTT Series Suggestion: నాని నిర్మాతగా వ్యవహరించిన ఈ క్యూట్ సిరీస్ చూశారా.. ఏ OTT లో ఉందంటే!

OTT Best Anthology Series: ఆంథాలజీ సిరీస్ లకు ఈ మధ్య బాగా క్రేజ్ పెరుగుతుంది. నాలుగు ఐదు కథలను ఒకే దానిలో చూపించి.. ప్రేక్షకులకు ఈ ఆంథాలజీ సినిమాలు , సిరీస్ లపైన ఇంట్రెస్ట్ కలిగేలా చేస్తున్నారు మేకర్స్ . మరి హీరో నాని నిర్మాతగా వ్యవహరించిన ఈ సిరీస్ ను మీరు చూశారా..

OTT Best Anthology Series: ఆంథాలజీ సిరీస్ లకు ఈ మధ్య బాగా క్రేజ్ పెరుగుతుంది. నాలుగు ఐదు కథలను ఒకే దానిలో చూపించి.. ప్రేక్షకులకు ఈ ఆంథాలజీ సినిమాలు , సిరీస్ లపైన ఇంట్రెస్ట్ కలిగేలా చేస్తున్నారు మేకర్స్ . మరి హీరో నాని నిర్మాతగా వ్యవహరించిన ఈ సిరీస్ ను మీరు చూశారా..

వెండి తెరపై అలరించిన నటి నటులు.. ఓటీటీ లలో నటించడం చూస్తూనే ఉన్నాము. అలానే కొంతమంది స్టార్ హీరోస్ కొన్ని వెబ్ సిరీస్ లకు , సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే హీరో నాని ఓ మంచి ఫీల్ గుడ్ వెబ్ సిరీస్ కు నిర్మాతగా వ్యహరించారు. ఇక ఈ మధ్య కాలంలో హర్రర్ , ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీస్ ను ఎంత ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారో.. ఆంథాలజీ సిరీస్ లను కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు మూవీ లవర్స్. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ ఫీల్ గుడ్ ఆంథాలజీ సిరీస్ గురించే. ఈ సిరీస్ కు హీరో నాని నిర్మాతగా వ్యవహరించారు. మరి ఈ సిరీస్ ను మీరు చూశారో లేదో.. ఈ సిరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. ఓ లుక్ వేసేయండి.

ఈ ఆంథాలజీ సిరీస్ లో మొత్తం ఐదు కథలు ఉన్నాయి. మొదటి కథ మీట్ ది బాయ్.. ఈ కథలో స్వాతి అనే అమ్మాయి ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని. ఆమె తన తల్లిదండ్రుల బలవంతం మీద పెళ్లి చూపులకు ఒప్పుకుంటుంది. ఈ క్రమంలో ఆమెను అభి అనే అబ్బాయి కలుస్తాడు. వీరిద్దరి మధ్య ఎలాంటి పరిచయం ఏర్పడింది! ఆమె పెళ్ళికి ఒప్పుకుందా లేదా ! అతని వలన ఆమెకు పెళ్లిపై ఉన్న అభిప్రాయం మారుతుందా ! అనేది ఈ కథ. ఇక రెండవ కథ ఓల్డ్ ఈజ్ గోల్డ్.. ఈ కథలో సరోజ , జై అనే భార్య భర్తలు ఉంటారు. సరోజ తన ఫ్రెండ్స్ తో కలిసి ప్యారిస్ ట్రిప్ కు వెళ్లాలని ప్లాన్ చేస్తుంది. అది జై కు ఇష్టం లేదు. అలా అని ఆమెను ఆపలేడు .. ఆమె లేకుండా అతను ఒక్కరోజు కూడా ఉండలేడు. ఈ విషయాన్ని ఆమెకు ఎలా చెప్పాలో అర్థంకాదు. ఈ క్రమంలోనే.. సరోజ.. మోహన రావు అనే ఓ పెద్దాయనను కలుస్తుంది. అతని వలన ఆమెకు భార్య భర్తల భందం మీద మరింత అవగాహాన కలుగుతుంది. మరి అతని వలన సరోజ తన భర్తను ఎలా అర్థంచేసుకుంటుంది. అతనిని వదిలి ట్రిప్ కు వెళ్తుందా లేదా ! అనేది ఈ కథ.

ఇక మూడవ కథ ఇన్ లా.. ఈ కథలో సిద్ధార్ద్ , పూజ ఇద్దరు ఒకరినొకరు ప్రేమిచుకుంటారు. అయితే పూజ సిద్ధార్ధ్ కంటే వయసులో పెద్దది. వీరిద్దరూ కలిసి తిరగడం సిద్దార్ద్ తల్లి చూస్తుంది. అయినా సరే పూజ ఎలాంటి మనిషో తెలుసుకోవాలని.. పూజతో ఓ అపరిచితురాలులా పరిచయం పెంచుకుంటుంది. ఈ క్రమంలో ఆమె పూజ కంటే కూడా తన కొడుకు గురించే ఎక్కువ తెలుసుకుంటుంది. మరి పూజను ఆమె యాక్సెప్ట్ చేస్తుందా లేదా ! అనేది ఈ కథ. ఇక నాలుగవ కథ స్టార్స్ టాక్.. ఈ కథ విషయానికొస్తే.. బాగా ఫేమస్ అయిన ఓ హీరోయిన్ కార్ .. ఓ వర్షం కురుస్తున్న రాత్రి బ్రేక్ డౌన్ అవ్వడంతో.. ఆమెకు ఓ డాక్టర్ లిఫ్ట్ ఇస్తాడు. ఈ క్రమంలో వాళ్ళిద్దరి మధ్య పరిచయం బాగా పెరుగుతుంది. జీవితంలో వారికి ఏం కావాలి! ఎలాంటి వారిని కోరుకుంటారు ! వీళ్లిద్దరి పరిచయం ఎక్కడి వరకు దారి తీస్తుంది! అనేదే కథ.

ఇక ఐదవ కథ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్.. అంజన, అజయ్ అనే ఇద్దరు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారు. పెళ్ళైనా కానీ వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేని వాళ్ళ లానే ప్రవర్తిస్తూ ఉంటారు. ఒకానొక టైం లో వారు విడిపోవాలని కూడా అనుకుంటారు. సరిగ్గా ఇదే సమయంలో అంజనాకు కిరణ్ అనే అమ్మాయి పరిచయం అవుతుంది. ఆమె అంజనాకు అజయ్ గురించి చాలా విషయాలు చెప్తుంది. దీనితో అంజనాకు అజయ్ మీద ఫీలింగ్స్ కలుగుతాయి. అసలు కిరణ్ ఎవరు! ఎందుకు అంజనాకు అజయ్ గురించి చెప్తుంది! అనేదే ఈ కథ. మరి ఇప్పటివరకు ఈ సిరీస్ ను ఎవరైనా మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సిరీస్ ప్రస్తుతం సోని లివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments