OTT Best Investigation crime Thriller: మీ మైండ్ తో ఆడుకునే మలయాళ సినిమా.. OTT లో ఉంది చూశారా!

OTT Best Investigation Thriller: మీ మైండ్ తో ఆడుకునే మలయాళ సినిమా.. OTT లో ఉంది చూశారా!

OTT Movie Suggestion : మలయాళ సినిమాలు ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో మరొక మలయాళీ సినిమా ఓటీటీ లో అందరిని మెప్పించేస్తుంది. మరి ఈ మూవీ మీరు మిస్ చేసిన లిస్ట్ లో ఉందొ లేదో ఓ లుక్ వేసేయండి.

OTT Movie Suggestion : మలయాళ సినిమాలు ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో మరొక మలయాళీ సినిమా ఓటీటీ లో అందరిని మెప్పించేస్తుంది. మరి ఈ మూవీ మీరు మిస్ చేసిన లిస్ట్ లో ఉందొ లేదో ఓ లుక్ వేసేయండి.

ఓటీటీ లోకి వచ్చిన సినిమాలు,, సిరీస్ లు వచ్చినట్లు చూసేస్తున్నారు ప్రేక్షకులు. ఈ క్రమంలో మేకర్స్ కూడా చాల జాగ్రత్తగా ప్లాన్ చేస్తూ .. ప్రతి వారం మంచి మంచి సినిమాలతో ముందుకు వస్తున్నారు. ఇక ఏ ఏ సినిమాలు, ఎప్పుడెప్పుడు వస్తాయా అనే లిస్ట్ కూడా ఎప్పటికప్పుడు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు వస్తున్న సినిమాలను చూస్తున్న ప్రేక్షకులు.. ఆల్రెడీ ఓటీటీ లో ఉన్న కొన్ని సినిమాలను చూడడం మిస్ అవుతున్నారు. ఇక వాటిలో మలయాళీ సినిమాలు ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ మలయాళీ సినిమానే. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం .

సినిమా ఏంటో తెలుసుకునే ముందు ఈ సినిమా కథేంటో చూసేద్దాం. జాయ్ అనే ఓ క్రిమినల్ ను పట్టుకోడానికి.. ఒక ఎస్ఐ, ఒక కానిస్టేబుల్ తమ పేర్లు మార్చుకుని.. చురులి అనే ఓ గ్రామానికి వెళ్తారు. అక్కడ వారిద్దరూ అండర్ కవర్ పోలీసులుగా ఉంటారు. అయితే ఆ ఊరిలో ఉండే తంకన్ అనే వ్యక్తి దగ్గర.. గుంతలు తవ్వడానికి వచ్చిన కూలీలుగా వారు పరిచయం చేసుకుంటారు. కానీ, ఆ సమయంలో తంకన్ ఊరిలో లేకపోడంతో.. వారి ఇద్దరినీ ఓ కల్లు దుకాణం యజమాని పనిలో పెట్టుకుంటాడు. జాయ్ ఎవరో తెలుసుకుని పట్టుకునేందుకు వారిద్దరూ కూడా ఆ కల్లు దూకాణంలో.. పనికి చేరుతారు. ఆ గ్రామంలో అడుగుపెట్టిన పోలీసులకు ఎదురైన సంఘటనలు ఏంటి ? అక్కడ గ్రామస్థల తీరు ఎలా ఉంది ? అసలు జయ్ అనే క్రిమినల్ ఎవరు ? ఏం చేసాడు? చివరికి వీరి మిషన్ సక్సెస్ అయిందా లేదా ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

ఈ సినిమా కథను బట్టి.. అందరు ఈజీగానే గెస్ చేసేస్తారు. ఇది ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ అని. దాదాపు ఇన్వెస్టిగేషన్ మూవీ ప్లాట్స్ అన్ని కూడా ఒకే విధంగానే ఉంటాయి. కానీ వారు ఆ కేసును సాల్వ్ చేసే తీరు మాత్రం అందరిని ఆయా సినిమాలు చేసేవిధంగా చేస్తుంటాయి. ప్రతి కథలోనూ ఎదో ఒక కొత్త ఎలిమెంట్ ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తూనే ఉంటుంది. ఈ సినిమా కూడా అలాంటిదే. ఏముందిలే రెగ్యులర్ స్టోరీ ఏ కదా అని లైట్ తీసుకుంటే మాత్రం.. పొరపడినట్లే. ఈ సినిమాలో అదిరిపోయే ట్విస్ట్ లు ఉంటాయి. కాబట్టి ఈ సినిమాను అసలు మిస్ కాకుండా చూడండి. ఇంతకీ ఈ సినిమా పేరు ఏంటంటే “చురులి”. ఈ సినిమా ప్రస్తుతం సోని లివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటి వరకు ఈ సినిమా ఎవరైనా మిస్ చేస్తే మాత్రం.. వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments