OTT లో బెస్ట్ 10 హార్రర్ మూవీస్ ఇవే.. ఒక్కోటి ఒక్కో రేంజ్.. వెన్నులో వణుకు పుట్టించేస్తాయి

OTT Best 10 Horror Movies : ఈ మధ్య హర్రర్ మూవీ లవర్స్ బాగా ఎక్కువైపోయారు. ఎప్పుడు చూసిన హర్రర్ సినిమాల కోసమే సెర్చ్ చేస్తూ ఉంటున్నారు. అటువంటి వారికి ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాలు బెస్ట్ ఛాయస్. అవేంటో చూసేయండి.

OTT Best 10 Horror Movies : ఈ మధ్య హర్రర్ మూవీ లవర్స్ బాగా ఎక్కువైపోయారు. ఎప్పుడు చూసిన హర్రర్ సినిమాల కోసమే సెర్చ్ చేస్తూ ఉంటున్నారు. అటువంటి వారికి ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాలు బెస్ట్ ఛాయస్. అవేంటో చూసేయండి.

ఇప్పుడు హర్రర్ సినిమాలను ఇష్టపడని వారు ఎవరు ఉండడం లేదు. భయపడుతున్న సరే.. ఎదో విధంగా ఈ సినిమాలను చూస్తున్నారు. ఇక హర్రర్ మూవీ లవర్స్ ను దృష్టిలో ఉంచుకుని.. మేకర్స్ కూడా చాలా ప్లాన్డ్ గా కొత్త కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. దాదాపు ఓటీటీ లో వచ్చిన హర్రర్ మూవీస్ ను వచ్చినట్లు చూస్తూనే ఉంటున్నారు. ఇంకా ఏమైనా హర్ర మూవీస్ కోసం కనుక సెర్చ్ చేస్తున్నట్లైతే.. ఇప్పడు చెప్పుకోబోయే సినిమాలు బెస్ట్ ఛాయస్. మరి ఆ సినిమాలేంటో.. వాటిలో మీరు మిస్ చేసిన సినిమాలేంటో.. అవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేయండి.

గ్యాస్ లైట్ :

ఈ సినిమాలో సారా అలీ ఖాన్, విక్రాంత్ మాసే, చిత్రాంగద సింగ్ కీలక పాత్రల్లో నటించారు. దాదాపుగా ఈ మూవీలో అన్నీ ట్విస్టులే ఉంటాయి. ఇక క్లైమాక్స్ మాత్రం అసలు ఎవరి ఊహకు అందదు . ఈ సినిమా ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమా చూడకపోతే మాత్రం ఇప్పుడే చూడండి.

ఇవన్నా:

ఈ సినిమాలో హర్రర్ ఎలిమెంట్స్ కు దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది. ఒకటి రెండు కాదు.. ప్రతి సీన్ లో హర్రర్ ఎలిమెంట్స్ ఫుల్ గా ఉంటాయి. 1943 లో జరిగిన ఓ కథ .. తిరిగి 1993 లో కూడా కొనసాగితే ఎలా ఉంటుంది. 1943 లో జరిగిన సంఘటనలు 1993 లో ఎందుకు మెదిలాయి ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే . ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

కుయాంగ్ :

అసలు ఓటీటీ లో అచ్చం హర్రర్ సినిమాలే ఉన్నాయా అనే ఫీలింగ్ కూడా ఒక్కోసారి వచ్చేస్తుంది. చూసిన కొద్దీ తరగని ఎన్నో హర్రర్ సినిమాలు , సిరీస్ లు ఇప్పుడు ఓటీటీ లో సందడి చేస్తున్నాయి. ఇక వీటిలో కొన్ని నిజజీవిత సంఘటనలను ఆధారంగా తీసుకుని రూపొందిస్తు ఉంటారు. ఈ సినిమా కూడా అంతే .. ఇండోనేషియాలోని ఓ గ్రామంలో జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా రూపొందించారు. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

సైలెంట్ హిల్:

కొంతమంది హర్రర్ , క్రైమ్ థ్రిల్లెర్స్ లో కూడా ఒంటరిగా చూడడానికి ఇష్టపడుతున్నారు కొందరు. కానీ ఇప్పడు చెప్పుకోబోయే సినిమాను మాత్రం అసలు ఒంటరిగా చూడలేరు. ఇలాంటి సినిమాలు ఓటీటీ లో చాలానే ఉన్నాయి. కానీ ఈ సినిమా మాత్రం చాలా డిఫరెంట్. ఇప్పటివరకు ఈ సినిమాను మిస్ చేస్తే మాత్రం మంచి హర్రర్ థ్రిల్లర్ ను మిస్ చేసినట్లే. ఈ సినిమా ప్రస్తుతం యూట్యూబ్ లో కూడా అందుబాటులో ఉంది.

వెరోనికా:

దాదాపు హర్రర్ సినిమాలన్నీ కూడా ఊహాగానాలే.. వాటితోనే ప్రేక్షకులను భయపెడుతూ.. ఇలాంటి సినిమాలపై ఇంట్రెస్ట్ కలిగేలా చేస్తున్నారు మేకర్స్. మరి అలాంటిది ఎక్కడో జరిగిన నిజమైన దెయ్యాల కథను ఆధారంగా తీసుకుని.. సినిమాను తీస్తే.. ఇక ఈ సినిమా చూసి భయపడని వారు ఎవరు ఉండరు. ఈ సినిమా కూడా అలాంటిదే . ఇప్పటివరకు ఎన్నో హర్రర్ సినిమాలను చూసి ఉంటారు కానీ.. నిజమైన దెయ్యాలు కథల ఆధారంగా వచ్చిన ఈ సినిమాను మాత్రం చూసి ఉండరు. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

హౌస్ ఆఫ్ ది డిస్సపియర్డ్ :

ప్రస్తుతం ఓటీటీ లో కొరియన్ కంటెంట్ కు బాగా డిమాండ్ ఉందని చెప్పి తీరాలి. ఈ సినిమా కొరియన్ థియేటర్స్ లో 2017 లో రిలీజ్ అయింది. ఆ సమయంలో ఈ సినిమాకు మంచి పాపులారిటీ దక్కింది. ఇక హర్రర్ లో సైకలాజికల్ థ్రిల్లర్స్ కు మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలియనిది కాదు. ఈ సినిమా కూడా ఇలాంటిదే. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది.

హోమ్ ఫర్ రెంట్ :

ఎంతైనా హారర్ సినిమాలలో ఉన్నంత కిక్ మరే సినిమాలలోను దొరకదు అని భావిస్తూ ఉంటారు హార్రర్ మూవీ లవర్స్. పైగా ఈ హర్రర్ సినిమా జోనర్ లో ఎన్ని సినిమాలు వచ్చినా కానీ వాటిని ఇంకా ఇంకా చూడాలని అనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమాలోని హర్రర్ ఎలిమెంట్స్ అయితే ఎవరి ఊహకు అందవు. ప్రతి ఒక్కరిని కదలకుండా సినిమా మొత్తం చూసేలా చేస్తాయి ఇందులోని హర్రర్ ఎలిమెంట్స్ . ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది.

వేయి శుభములు కలుగు నీకు:

హర్రర్ అంటే కేవలం హాలీవుడ్ , బాలీవుడ్ లోనే కాదు.. తెలుగులో కూడా మంచి హర్రర్ కాన్సెప్ట్ సినిమాలు ఉన్నాయి. అలాంటి వాటిలో ఈ సినిమా కూడా ఒకటి.. హారర్, థ్రిల్లర్ సినిమాలు తెరకెక్కించడమంటే చాలా రిస్క్ అని చెప్పి తీరాలి. అలాంటిది తెలుగులో ఇలాంటి ఓ సినిమాను తీసి మేకర్స్ సక్సెస్ అయ్యారు అని ఈ సినిమా చూసిన అందరికి అనిపిస్తుంది. ఈ సినిమాలో శివాజీ రాజా కుమారుడు విజయ్ రాజా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా ప్రస్తుతం.. ఆహా లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇట్ లీవ్స్ ఇన్సైడ్:

ప్రపంచంలో ఏ దేశం వారికైనా సరే భారతీయ సంప్రదాయం అంటే ప్రత్యేకమైన అభిప్రాయం ఉంటుంది. ముఖ్యంగా అమెరికన్స్ ఇండియన్ కల్చర్ ను చాలా ఇష్టపడుతుంటారు. ఇలాంటి ఓ మైథలాజికల్ కథకు హర్రర్ టచ్ ఇస్తే.. ఇక ఆ సినిమా మరో లెవెల్ లో ఉంటుంది. 2023 లో వచ్చిన ఈ సినిమా అమెరికన్స్ కు తెగ నచ్చేసింది. అప్పట్లో ఈ సినిమాకు మంచి రేటింగ్స్ కూడా వచ్చాయి. ఈ సినిమా ప్రస్తుతం.. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఈ సినిమాను ఎవరు చూడకపోతే కనుక ఇప్పుడే చూసేయండి.

ఆవిరి :

హర్రర్ మూవీస్ అంటే కేవలం హాలీవుడ్ వాళ్ళు మాత్రమే బాగా చూపించగలరు అనుకునే టైమ్ లో.. తెలుగులో కూడా మంచి హారర్ కంటెంట్ తో సినిమాలను తెరకెక్కించవచ్చని నిరూపించారు కొంతమంది దర్శకులు.వారిలో రవి బాబు కూడా ఒకరు. తెలుగులో ఇలాంటి కథలను రూపొందించడం కేవలం రవి బాబుకు మాత్రమే సాధ్యం. హారర్ సస్పెన్స్ థ్రిల్లర్స్ ను మెచ్చే ప్రేక్షకులను ఈ సినిమా ఈజీగా మెప్పించేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

Show comments