అప్పుడే OTT లోకి భారతీయుడు 2.. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

Bharateeyudu 2 OTT: శంకర్ దర్శకత్వంలో రిలీజ్ అయినా భారతీయుడు2 మూవీ అందరి అంచనాలను తారుమారు చేసేసింది. ఈ క్రమంలో ఈ సినిమా త్వరలోనే ఓటీటీ లోకి రానుందంటూ టాక్ వినిపిస్తుంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Bharateeyudu 2 OTT: శంకర్ దర్శకత్వంలో రిలీజ్ అయినా భారతీయుడు2 మూవీ అందరి అంచనాలను తారుమారు చేసేసింది. ఈ క్రమంలో ఈ సినిమా త్వరలోనే ఓటీటీ లోకి రానుందంటూ టాక్ వినిపిస్తుంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ వారం ఓటీటీ లో ఏ ఏ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి అనే లిస్ట్ ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. ఇక ఈ సినిమాలు కాకుండా ప్రేక్షకులు ఎదురుచూసే సినిమాలు ఏమైనా ఉన్నాయా అంటే అవి థియేటర్ లో రిలీజ్ అయినా భారీ బడ్జెట్ సినిమాలే. అయితే రీసెంట్ గా థియేటర్ లో రిలీజ్ అయినా భారీ బడ్జెట్ సినిమాలంటే. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన కల్కి , శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు2 . కల్కి మూవీకి సంబంధించిన ఓటీటీ డీటెయిల్స్ ఆల్రెడీ చూసాము. ఇదైతే ఇప్పట్లో ఓటీటీ లోకి రాదు. ఇక ఇప్పుడు భారతీయుడు 2 మూవీ థియేటర్ లో రిలీజ్ అయినా నెలరోజుల లోపే ఓటీటీ లోకి రానుందనే టాక్ వినిపిస్తుంది. దానికి సంబంధించిన విషయాలను చూసేద్దాం.

అప్పట్లో వచ్చిన భారతీయుడు మూవీ.. ఇండియన్ టాలీవుడ్ మూవీ హిస్టరీలో.. బెస్ట్ మూవీగా నిలిచింది. ఇప్పటికి కూడా ఈ సినిమాకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటారు. ఇక ఇన్నేళ్ల తర్వాత ఆ సినిమాకు సిక్వెల్ గా భారతీయుడు 2 వస్తుందంటే.. అందరూ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ భారతీయుడు 2 రిలీజ్ తర్వాత.. అందరి అంచనాలను తారుమారు చేసింది. భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా.. బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇప్పటికే చాల వరకు థియేటర్స్ లో ఈ సినిమా రన్ అవ్వడంలేదు. దీనితో త్వరలోనే ఈ మూవీ ఓటీటీ లోకి రానుందనే టాక్ వినిపిస్తుంది. భారతీయుడు 2 మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను ఆగష్టు 2 నుంచి స్ట్రీమింగ్ కు తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్ దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సాధారణంగా ఓటీటీ రూల్స్ ప్రకారం.. థియేటర్ లో విడుదల అయినా ఏ సినిమా అయినా కానీ.. ఓటీటీ లోకి రావాలంటే నెల నుంచి రెండు నెలల సమయం తీసుకుంటుంది. భారీ బడ్జెట్ సినిమాల సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అవి ఆలస్యంగానే ఓటీటీ లోకి అడుగుపెడతాయన్న సంగతి తెలిసిందే. ఒకవేళ థియేటర్ లో కనుక ఆయా సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోతే.. నెలలోపే ఓటీటీ లో ఎంట్రీ ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు భారతీయుడు 2 మూవీ విషయంలోనూ అదే జరిగింది. త్వరలోనే థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకుని ఈ మూవీ ఓటీటీ వైపు అడుగులు వేస్తుంది. ఇక ఓటీటీ లో అయినా ఈ మూవీ మంచి టాక్ ను సంపాదించుకుంటుందో లేదో వేచి చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments