NTR దేవరకి.. శాంపిల్ లాంటి వెబ్ సిరీస్ OTTలోకి! సముద్రపు దొంగల చుట్టూ!

ఎప్పటిలానే మరో థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. ఈమధ్య సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ కి ఆదరణ ఏ రేంజ్ లో లభిస్తుందో చూస్తూనే ఉన్నాము. ఈ క్రమంలో అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ దేవర సినిమాకు సింక్ లో ఉండే .. షిప్ హైజాక్ తో సాగే ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయింది.

ఎప్పటిలానే మరో థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. ఈమధ్య సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ కి ఆదరణ ఏ రేంజ్ లో లభిస్తుందో చూస్తూనే ఉన్నాము. ఈ క్రమంలో అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ దేవర సినిమాకు సింక్ లో ఉండే .. షిప్ హైజాక్ తో సాగే ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయింది.

సస్పెన్స్ థ్రిల్లర్ అంటే అది సినిమా అయినా వెబ్ సిరీస్ అయినా కూడా వాటికీ మంచి ఆదరణ లభిస్తోంది. అందులోను ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు, వెబ్ సిరీస్ లకు సెపరేట్ వ్యూవర్స్ ఉంటున్నారు. దీనితో మేకర్స్ కూడా చాలా జాగ్రత్తగా ఈ వీటిని రిలీజ్ చేస్తున్నారు. రెండేళ్ల క్రితం సెప్టెంబర్ లో టీజర్ రిలీజ్ చేసిన వెబ్ సిరీస్ ను .. మార్చి 22న ఓటీటీలో విడుదల చేశారు. సెప్టెంబర్, 2022లో .. షిప్ హైజాక్ నేపథ్యంలో .. సోమాలియా సముద్రపు దొంగల చుట్టూ తిరిగే “లూటేరే” అనే వెబ్ సిరీస్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఉండడంతో .. ఈ వెబ్ సిరీస్ కోసం అందరూ వెయిట్ చేశారు. ఇక ఇన్నాళ్లకు ఎట్టకేలకు ఈ వెబ్ సిరీస్ మార్చి 22 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి, ఈ సిరీస్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నిజానికి ఏదైనా ఒక సినిమా, వెబ్ సిరీస్ కు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేసిన తర్వాత.. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వాటిని రిలీజ్ చేస్తూ ఉంటారు. కానీ, లూటేరే వెబ్ సిరీస్ మాత్రం రిలీజ్ అవ్వడానికి చాలా సమయం పట్టింది. దీనికి కారణం షూటింగ్ పనులు త్వరగా పూర్తి కాకపోవడమే అని టాక్. ఇక ఎట్టకేలకు మార్చి 22నుంచి ఈ సిరీస్ ఓటీటీలోకి వచేసింది. కాస్త ఆలస్యం అయినా ఈ సిరీస్ ను రిలీజ్ అయితే రిలీజ్ చేసారులే కానీ, ప్రస్తుతానికి కేవలం రెండు ఎపిసోడ్స్ ను మాత్రమే రిలీజ్ చేశారు. ఈ వెబ్ సిరీస్ ను ప్రముఖ డైరెక్టర్ హన్సల్ మెహతా క్రియేషన్ లో .. అతని తనయుడు జై మెహతా డైరెక్ట్ చేశాడు. ఈ సిరీస్ లో రజత్ కపూర్, వివేక్ గోంబర్, అమృతా ఖన్విల్కర్, ప్రీతికా చావ్లా, చందన్ రాయ్ సన్యాల్ ప్రధాన పాత్రలలో నటించారు.

అయితే ప్రస్తుతం తెలుగు ఆడియన్స్ అందరూ.. ఎన్టీఆర్ సినిమా అయినా దేవర కోసం ఎంత ఎదురుచూస్తున్నారో అందరికి తెలుసు దేవర సినిమా కథ మొత్తం సముద్రంలోనే సాగేలా ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఈ సిరీస్ కు దేవర సినిమాకు ఎటువంటి సంబంధం లేదు కానీ, దీనిని చూస్తే దేవర రిలీజ్ అయ్యేవరకు కాస్త ఫ్యాన్స్ కు ఊరట కలగవచ్చు.. సోమాలియా పైరేట్స్ ఓ షిప్ ను హైజాక్ చేసినపుడు, దానిని విడిపించడానికి ఎటువంటి ప్రయత్నాలు జరిగాయి అనే కథాంశంతో ఈ సిరీస్ కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇక లూటేరే సిరీస్ కథ విషయానికొస్తే.. ఈ సిరీస్ కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. నడి సముద్రంలో సోమాలియా పైరేట్స్ అకృత్యాలు ఏ స్థాయిలో ఉంటాయి అనేది.. ఈ సిరీస్ లో చూపించారు. అయితే 1993లో లూటేరే అనే పేరుతో బాలీవుడ్ లో ఓ సినిమా వచ్చింది. కానీ, దానికి ఈ సిరీస్ కు మాత్రం ఎటువంటి సంబంధం లేదు. ఉక్రెయిన్ నుంచి సోమాలియాకు కొన్ని విలువైన సరుకులతో ఓ ఓడ బయలుదేరుతుంది. ఓ వ్యక్తి సోమాలియా పైరేట్స్ తో ఓడను హైజాక్ చేయిస్తాడు. ఆ హైజాక్ ఎలా జరిగింది? తర్వాత ఓడలో ఎలాంటి విషాదకర ఘటనలు జరిగాయి? ఇంకా రాబోయే ఎపిసోడ్స్ లో ఈ సిరీస్ కథ ఎటువంటి మలుపులు తిరగనున్నాయి. అనేది ఈ సిరీస్ లో స్పష్టంగా చూపించబోతున్నారట. త్వరలోనే మిగిలిన ఎపిసోడ్స్ ను కూడా విడుదల చేయనున్నారు. మరి, ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments