Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ విఫలం కావడంతో టీడీపీ డీలా పడింది.గత బుధవారం రాష్ట్ర బంద్ నుంచి చంద్రబాబు 36 గంటల దీక్ష ఆ తర్వాత సోమవారం రాష్ట్రపతిని కలిసే వరకూ హంగామా చేసిన టీడీపీ శ్రేణులు,బాబును ఆకాశానికెత్తి..ఇక జగన్ పని అయిపోయిందనేలా ప్రచారం చేసిన అనుకూల మీడియా శ్రమ అంతా నీరుగారిపోయింది. అమిత్‌షాతో భేటీ, ప్రధానితో అపాయింట్‌మెంట్, కేంద్ర మంత్రులతో సమావేశాలు అంటూ ఎంతో ఆశతో హస్తిన పర్యటనకు వెళ్లిన చంద్రబాబు బృందానికి నిరాశ తప్పలేదు.రాష్ట్రపతిని కలసిన తర్వాత ప్రధాని, హోం మంత్రులు అపాయింట్‌మెంట్ దొరక్కపోవడంతో ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ చంద్రబాబు చేసిన యాగీ దూదిపింజల్లా తేలిపోయింది.
ఢిల్లీ వెళ్లే ముందు అనుకూల మీడియా ఇచ్చిన బిల్డప్‌తో ఎన్నో ఆశలుపెట్టుకున్న టీడీపీ శ్రేణులు హస్తినలో బాబుకు ఎదురైన అనుభవంతో నిరాశలో కూరుకుపోయాయి. దీంతో ఏం చేయాలో పాలుపోని టీడీపీ నేతలు, అనుకూల మీడియా ఈ రోజు మధ్యాహ్నం వరకు మిన్నుకుండిపోయాయి. మధ్యాహ్నం తర్వాత అనుకూల మీడియాలో చిన్నపాటి స్రోలింగ్‌లు మొదయ్యాయి. అమిత్ షా చంద్రబాబుకు ఫోన్ చేశారు అంటూ మొదలుపెట్టాయి. రాష్ట్రంలో పరిస్థితులపై ఆరా తీశారని, చంద్రబాబు అమిత్ షాకు అన్ని విషయాలు చెప్పారంటూ బ్రేకింగ్ న్యూస్‌లు వేశాయి. కశ్మీర్ పర్యటన, ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉండడంతో అమిత్ షా అపాయింట్‌మెంట్ దొరకలేదని, అందుకే ఈరోజు ఫోన్ చేశారని ప్యాచ్‌వర్క్‌లు మొదలుపెట్టాయి.
అనుకూల మీడియాలో ఇలాంటి బ్రేకింగ్‌లు రాగా,టీడీపీ నేతలు కూడా వెంటనే అందుకున్నారు. యథావిధిగా సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు మొదలుపెట్టారు. అమిత్‌షా కలవాలని పిలుస్తున్నా జగన్ ఎందుకు వెళ్లడం లేదంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్న సంధించారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా అంటే వైఎస్ జగన్ భయపడుతున్నారని,ఆ విషయం తనకు మాత్రమే తెలుసన్నట్లుగా మాట్లాడారు.అమిత్ షా అపాయింట్‌మెంట్ దొరక్కపోవడంపై అనుకూల మీడియా చెప్పిన కారణాన్నే ఉమా కూడా పలికారు. అయితే ఈ కారణం నిన్న అపాయింట్మెంట్ లభించని సమయంలో హోం మంత్రి కార్యాలయం చెప్పలేదా? అనే ప్రశ్న సామాన్యులలో సైతం సాధారణంగా తలెత్తుతుంది. ఒక్క రోజు తర్వాత అమిత్ షా ఫోన్ చేయడం, పైగా అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వలేదో కారణం కూడా చెప్పడమే ఇక్కడ విశేషం.
Also Read : NCRB Data Over Ganja – బాబు అబద్దాలు అతకడం లేదు ! గంజాయిపై వాస్తవాలు ఇవీ !