Idream media
Idream media
తెలుగుదేశం టీం ఢిల్లీలో ఇప్పటికే పర్యటించి రాష్ట్రపతిని కలిసి వచ్చింది. ఇప్పుడు వైసీపీ కూడా ఢిల్లీ బాట పట్టనుందా? రాష్ట్రంలోని పరిస్థితులపై నిజానిజాలను కేంద్ర పెద్దలకు వివరించేందుకు సిద్ధమవుతోందా? అంటే అవును అన్నట్లుగానే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ వెళ్తాం ఏపీ సర్కార్ మీద ఫిర్యాదు చేస్తాం మొత్తానికి మొత్తం వ్యవస్థలను రిపేర్లు చేస్తామని తెలుగుదేశం పార్టీ ఆర్భాటంగా చెప్పింది. చంద్రబాబును చూసుకుని ఢిల్లీ వెళ్లారు రెండు రోజులు అక్కడ మకాం చేశారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ని కలసి ఏపీలో రాష్ట్రపతిపాలన పెట్టమని కోరారు. ఆ తరువాత వెనుతిరిగి వచ్చేశారు.
ఇపుడు వైసీపీ నేతలు ఢిల్లీ యాత్రకు సిద్ధమవుతున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి దేశ రాజధాని చేరుకుని చంద్రబాబు మీద హాట్ హాట్ కామెంట్స్ చేయడం ద్వారా మాటల యుద్ధాన్ని మొదలెట్టేశారు. వైసీపీ ఎంపీలు కూడా త్వరలోనే రాష్ట్రపతి రామ్ నాథ్కోవింద్ ని కలుస్తారు అంటున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యక్తిగత ఆరోపణలు ఉపయోగించిన దారుణ పదజాలానికి సంబంధించిన వీడియోను కూడా రాష్ట్రపతిని వైసీపీ ఎంపీలు ఇస్తారని తెలుస్తోంది. రాష్ట్రపతి అపాయింట్మెంట్ దొరికిన వెంటనే ఏపీలో టీడీపీ చేస్తున్న అరాచకాలను తామూ చెబుతామని అంటున్నారు.
అదే విధంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా వైసీపీ ఎంపీలు కలసి టీడీపీ గుర్తింపు రద్దు చేయమని కోరుతారట. ప్రతిపక్ష పార్టీగా బాధ్యతాయుతంగా ఉండకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేస్తారట. ఒక రాజకీయ పార్టీగా రాజ్యాంగం ఇచ్చిన హక్కుని దుర్వినియోగం చేస్తోందని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి చూస్తోందని కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తారని చెబుతున్నారు. ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా వైసీపీ ఎంపీలు కలుస్తారని అంటున్నారు. అమిత్ షాకు కూడా రెండున్నరేళ్లుగా అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ని టీడీపీ ఎలా ఇబ్బందులు పెడుతుందో అన్ని ఆధారాలతో వివరిస్తారని అంటున్నారు. అదే జరిగితే టీడీపీకి మరిన్ని అవస్థలు తప్పేలా కనిపించడం లేదు.
Also Read : KS Jawahar – Ganja Cultivation – సెంట్రల్ జైల్‌లో గంజాయి సాగు.. నాటి మంత్రి జవహర్ మాట గుర్తుందా..?