ఖర్మ వదలదు.. కలవర పెడుతున్న మహిళ డెత్‌ నోట్‌!

పెళ్లి తర్వాత ప్రేమ వ్యవహారాలు, ఆకర్షణలు దారుణాలకు తెరతీస్తున్నాయి. వివాహేతర సంబంధాల కారణంగా నిత్యం ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా, భర్త వివాహేతర సంబంధం కారణంగా ఓ మహిళ ప్రాణాలు తీసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని చనిపోయింది. ఈ సంఘటన కర్ణాటకలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటక, బెంగళూరులోని  హగ్గనహళ్లికి చెందిన పవిత్ర భర్తతో గొడవ కారణంగా విడాకులు తీసుకుని వేరు పడింది. తర్వాత ఆమెకు చేతన్‌ గౌడ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.  ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.

పెళ్లి తర్వాత కొన్ని నెలలు వీరి కాపురం సాఫీగానే సాగింది. చేతన్‌ గౌడకు వేరే యువతితో ఎఫైర్‌ ఉందని తెలియటంతో పవిత్ర తట్టుకోలేకపోయింది. భర్తతో ఈ విషయమై తరుచుగా గొడవలు పడుతూ ఉండేది. పవిత్ర ఎంత చెప్పినా అతడిలో మార్పు రాలేదు. దీంతో ఆమె ఓ నిర్ణయానికి వచ్చింది. ఆత్మహత్య చేసుకోవటానికి ప్లాన్‌ చేసింది. ఆదివారం భర్త ఆఫీసుకు వెళ్లగానే తన గదిలోకి వెళ్లింది. వాట్సాప్‌ స్టేటస్‌గా తన ఫొటోను పెట్టింది. ఆ ఫొటో కింద తన డెత్‌ నోట్‌ను రాసింది. భర్త, ఆమె ప్రియురాలి కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆమె పేర్కొంది.

వారిద్దరినీ కఠినంగా శిక్షించాలని కూడా పేర్కొంది. తాను ఖర్మ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతానని, ఖర్మ ఎవ్వరినీ వదలదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అనంతరం గదిలోని సీలింగ్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇక, పవిత్ర స్టేటస్‌ చూసిన తల్లి హుటాహుటిన కూతురు ఇంటికి వెళ్లింది. అప్పటికే పవిత్ర చనిపోయి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. చేతన్‌ గౌడ, అతడి ప్రియురాలిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ సంఘటన మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments