ఆర్థిక కష్టాలు ఉన్నా ప్రభుత్వాలు ఎందుకు నోట్లను ముద్రించవో తెలుసా..?

దేశం ఆర్ధిక కష్టాల్లో ఉన్నప్పుడు, పేద ప్రజల వద్ద డబ్బు లేనప్పుడు ఎక్కువ డబ్బు ముద్రించి పంచేయవచ్చు కదా…? పేద ప్రజలకు అంతకంటే ప్రభుత్వాలు చేసేది ఏం ఉంటుంది…? ఈ విధంగా మనం కొంతమంది అవగాహన లేని వాళ్ళ నుంచి మాటలు వింటూ ఉంటాం. అసలు ఎక్కువ డబ్బును ఎందుకు కేంద్ర ప్రభుత్వాలు ముద్రించే ప్రయత్నం చేయవు…? దానికి ప్రధాన కారణం ఏంటీ…?

గత రెండు దశాబ్దాల కాలంలో వెనిజులా, జింబాబ్వే సహా కొన్ని దేశాలు ఆర్ధిక ఇబ్బందులు చాలా ఎదుర్కొన్నాయి. జింబాబ్వే, ఆఫ్రికా, మరియు వెనిజులా, దక్షిణ అమెరికాలో కొన్ని దేశాల్లో ఆయా ప్రభుత్వాలు తమ ఆర్ధిక వ్యవస్థను కాపాడుకోవడానికి ఎక్కువ డబ్బు ముద్రించాయి. ప్రింటింగ్ ప్రెస్ లు ఎప్పుడూ లేని విధంగా డబ్బుని ముద్రించాయి. ఆ తర్వాత నుంచి ఆయా దేశాల్లో టీ తాగాలన్నా సరే ప్రజలు సంచుల్లో డబ్బులు తీసుకెళ్ళే పరిస్థితి ఉంది. 20 రూపాయలు ఉండే టీ మన కరెన్సీలో కొన్ని వేలకు అమ్ముకున్నారు.

ఇప్పటికి కూడా ఆయా దేశాలు ఆర్ధిక కష్టాలు ఎదుర్కొంటున్నాయి. ప్రజల వద్ద కోట్లాది రూపాయలు ఉన్నా సరే వెనిజులా ఆర్ధిక వ్యవస్థను పునరుద్దరించడం సాధ్యం కాని పరిస్థితి. 2008 లో జింబాబ్వే అధిక ద్రవ్యోల్బణంతో దెబ్బతిన్న సమయంలో… ఒకే సంవత్సరంలో ధరలు 231,000,000% వరకు పెరిగాయి అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

Also Read : ఆ పుస్తకాన్ని చదవండి – ఉండవల్లి విజ్ఞప్తి

దేశంలో ఆర్ధిక వ్యవస్థ బలపడాలి అంటే కచ్చితంగా ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి. అంటే ప్రజల ఆదాయం క్రమంగా పెరుగుతూ ఉండాలి… తద్వారా డిమాండ్ ఆధారంగా ఉత్పత్తులు పెరగాలి. అయితే ప్రజల వద్ద ఒక పరిమితి ధాటి విచ్చల విడిగా డబ్బు ఉన్న సమయంలో కొనుగోలు శక్తి అనేది స్థాయికి మించి పెరిగిపోతుంది. వస్తువుల కోసం ప్రజలు భారీగా పోటీ పడతారు కాబట్టి ధరలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇంత డిమాండ్ లో ప్రజలకు సరిపడా వస్తువులను తయారు చేసే పరిస్థితి ఉండదు.

అయితే ప్రస్తుతం ఎక్కువ డబ్బును ముద్రించడం ద్వారా ధనవంతులయ్యే ఒక దేశం ఒక్క అమెరికా మాత్రమె. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల నుంచి బంగారం అలాగే చమురుతో సహా ఎన్నో ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంది అమెరికా. వాటి ధర అమెరికా డాలర్లలో మాత్రమే ఉంటుంది. అమెరికా ఎక్కువ ఉత్పత్తులను కొనాలి అనుకుంటే ఎక్కువ డాలర్లను ముద్రించి తన కొనుగోలు శక్తిని పెంచుకుంటుంది. అయితే ఇతర దేశాలు తమ కరెన్సీని మాత్రమే ముద్రించే వీలు ఉంటుంది.

ఎక్కువ కరెన్సీని ముద్రించినప్పుడు… డాలర్ విలువ క్రమంగా పెరిగిపోతుంది. ఈ విధంగా జరిగినప్పుడు మరో సమస్య కూడా ఉంది. ప్రజల వద్ద ఎక్కువ డబ్బు ఉన్న సమయంలో వస్తు మార్పిడి అనేది అమలు జరుగుతుంది. లేదంటే గనుక అమెరికా కరెన్సీలో డబ్బులు చెల్లించే అవకాశం ఉంది. డబ్బు ఎక్కువ ముద్రించడం ద్వారా దేశంలో ఆర్ధిక కష్టాలు తీరిపోతాయి అనేది ఒక భ్రమ. వ్యాపారాలు కుప్ప కూలిపోవడమే కాకుండా కార్మికులకు వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. ప్రజల వద్ద విచ్చలవిడిగా డబ్బు ఉన్నప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థ అనేది కుప్పకూలిపోయే అవకాశం ఉంటుంది. బ్యాంకుల వద్ద కూడా ప్రజలకు ఇచ్చే అంత నగదు నిల్వలు ఉండవు.

Also Read :  రొడ్డ కొట్టుడు.. రెచ్చగొట్టుడు..

Show comments