కేశినేనికి పొమ్మనకుండా పొగ పెట్టిన చంద్రబాబు!

  • Published - 01:59 PM, Sat - 27 February 21
కేశినేనికి పొమ్మనకుండా పొగ పెట్టిన చంద్రబాబు!

రాజకీయాల్లో ఎటు వాయువునుంచి దెబ్బ పడుతుందో కాచుకోవాలి. విపక్షం నుంచే కాదు కొన్నిసార్లు స్వపక్షం నుంచి కూడా ఊహించని దెబ్బలు తగులుతాయి. ఈ విషయం టీడీపీ నాయకులకు ఎక్కువ అనుభవం. అందరు నాకు కావలసినవారే అంటూ చంద్రబాబు పరోక్షంగా ప్రోత్సహించే వర్గపోరుకు ఎందరో నాయకులూ బలయ్యారు. ఇప్పుడు కేశినేని నానై వంతు వచ్చింది. బెజవాడ టిడిపిలో చెలరేగిన ఈ వివాదాన్ని సర్దుబాటు చేయాల్సిన చంద్రబాబు వెనకుండి ప్రత్యర్థి వర్గాన్ని ఎంపీ మీదకు ఉసిగొల్పడంతో పాటు సామజిక వర్గ కోణాన్ని తెరమీదికి తెస్తున్నారు.

రెండు ఒకే సామజిక వర్గనికా??

చేతికి మట్టి అంటకుండా తన పని తాను కానిచ్చే చంద్రబాబు కేశినేని నానికి చెక్ పెట్టేందుకు కొత్త వ్యూహం సిద్ధం చేసినట్లు అర్థమవుతోంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం జనరల్ అయింది. విజయవాడ పక్కనే ఉన్న గుంటూరు కార్పొరేషన్ మేయర్ పీఠం సైతం జనరల్ గానే ఉంది. దీంతో చంద్రబాబు కేశినేని ని ఇరుకున పెట్టేందుకు గుంటూరు మేయర్ అభ్యర్ధిగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ కోవెలమూడి రవీంద్రను ఖరారు చేశారు.

నిన్నమొన్నటి వరకు గుంటూరు మేయర్ ఎవరిని దానిమీద స్పష్టత లేకుండానే ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమైన టిడిపి ఇప్పుడు అత్యవసరంగా రవీంద్ర పేరును తెరమీదకు తీసుకురావడంతో పక్కనే ఉన్న విజయవాడ మేయర్ అభ్యర్థి సైతం కేశినేని నాని కూతురు శ్వేత కూడా ఒకే సామాజికవర్గం అవడంతో ప్రత్యర్థులకు మంచి ఆయుధాన్ని చంద్రబాబే అందించినట్లు అయింది. రెండు కీలకమైన నగరాలకు ఒకే సామాజికవర్గం నుంచి అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారని టీడీపీ అధినేత మీద ఒత్తిడి వచ్చినట్లు చెప్పి తర్వాత కేశినేని శ్వేతకు చెక్ పెట్టేందుకు చంద్రబాబు మద్దతుతో కేశినేని నాని వ్యతిరేక వర్గం రాజకీయం చేసున్నారన్నది ఆ పార్టీ నాయకుల అంతర్గతంగా అనుకుంటున్నా మాట.

మళ్ళీ రగడ!!

ఇటీవల బుద్ధా వెంకన్న,నాగుల మీరా లను పిలిపించి మాట్లాడిన చంద్రబాబు,కేశినేని నానితో ఫోనో మాట్లాడానని విజయవాడ టీడీపీలో ఎలాంటి ముఠాలు లేవని,నాయకులందరూ ఒకేతాటిపై ఉన్నారని మీడియాతో చెప్పాడు. కానీ ఈరోజు మరోసారి పార్టీలో విభేదాలు బయటపడ్డాయి.శనివారం మరోసారి బుద్ధ వెంకన్న వర్గీయులు కేసినేని నాని కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. అధినేత చంద్రబాబుతో పాటు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ వివాదం మీద దృష్టి పెట్టినా సమస్య సమాసిపోకపోవడం వెనుక టీడీపీ పెద్దలు హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.దీంతో టిడిపి పెద్దలు చెప్పిన వివాదం తెగక పోవడం వెనుక చంద్రబాబు వ్యూహాత్మక రాజకీయమా?అంటూ చర్చ నడుస్తుంది.

అత్యవసరంగా హైదరాబాద్ వెళ్ళిన బుద్దా

చంద్రబాబుకు నమ్మినబంటుగా ఉండే బుద్ధ వెంకన్న అత్యవసరంగా హైదరాబాద్ పర్యటన చేయడం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే 39 వ డివిజన్ అభ్యర్ధిత్వం విషయంలో కోపం మీద ఉన్న బుద్ధ వెంకన్న, మేయర్ అభ్యర్థిగా శ్వేతను ప్రకటిస్తే విజయవాడ నగరంలో టిడిపి పరిస్థితి పూర్తిగా దిగజారుతుందని చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకే వెళ్లారు అని తెలుస్తోంది.

ఇప్పటికిప్పుడు మేయర్ అభ్యర్ధిగా శ్వేత పేరును ప్రకటిస్తే ప్రమాదం వచ్చే అవకాశం ఉందని ఎన్నికల తర్వాత దీనిమీద ఆలోచించు వచ్చని బుద్ధ కోరుతున్నారు.దీని మీద చంద్రబాబు ఎలా స్పందిస్తారు?ఎన్నికల ముందే కేశినేని శ్వేతను మేయర్ గా ప్రకటిస్తారా?కేశినేని నాని ఏ స్టెప్ తీసుకుంటారు?విజయవాడ టీడీపీ శ్రేణులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Show comments