మా ఎన్నికల పోలింగ్ లో ఉద్రిక్తత

దాదాపుగా రెండు నెలల నుంచి ఉత్కంఠకు వేదికగా మారిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు క్లైమాక్స్ కు చేరుకున్నాయి. అయితే చివరి రోజు ఈ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. నేడు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఏ పరిణామాలు చోటుచేసుకుంటాయి ఏంటి అనేది ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఉదయం నుంచి కూడా పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మా ఎన్నికల్లో ఓటు వేయడానికి సినీ ప్రముఖులు అందరు వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ అలాగే రామ్ చరణ్, శ్రీకాంత్ చాలా మంది ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అయితే పది గంటల తర్వాత పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేస్తున్నారని ప్రకాష్ రాజు ప్యానల్ పై మంచు విష్ణు ప్యానల్ సభ్యుడు శివ బాలాజీ ఆరోపణలు చేసారు. అలాగే నమూనా బ్యాలెట్ ద్వారా ప్రచారం నిర్వహిస్తుందని మంచు విష్ణు ప్యానల్ ఆరోపించింది. అలాగే రిగ్గింగ్ జరుగుతుందని కూడా ఫిర్యాదు చేసింది.

ఈ నేపథ్యంలో దీనిపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు ఇవ్వగా… సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన ఎన్నికల సంఘం అధికారి మా ఎన్నికలలో రిగ్గిగింగ్ జరిగింది అని ప్రకటించారు. ప్రకాష్ రాజ్ తరఫున ఒక దొంగ ఓటు వేశారని ఆయన పేర్కొన్నారు. ఇక సినీ నటుడు బెనర్జీకి మంచు మోహన్ బాబు చంపేస్తానంటూ వార్నింగ్ ఇవ్వడం కొసమెరుపు. ప్రచారం విషయంలో అలాగే రిగ్గింగ్ విషయంలో రెండు ప్యానల్స్ మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది. దీంతో పోలీసులు వచ్చి ఇరు వర్గాలను విడగొట్టారు.

ఇక ఎన్నికల సంఘం అధికారి 2 ప్యానల్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బయట వారు వచ్చి ప్రచారం చేస్తే ఎన్నికలను రద్దు చేస్తానని పేర్కొన్నారు. అలాగే రిగ్గింగ్ మాత్రం ఖచ్చితంగా ఎన్నికలను రద్దు చేస్తా అని అన్నారు. మంచు మోహన్ బయు ఇతరులపై అరుస్తున్నారు అని ఫిర్యాదులు వచ్చాయని ఫిర్యాదులు ఉంటే ఇవ్వాలి అని కానీ ఎదుటివారిపై అరవద్దని ఎన్నికల సంఘం అధికారి కోరారు. ఈ ఉద్రిక్తతల నడుమ ఎన్నికలను కాసేపు ఎన్నికల అధికారి వాయిదా వేసారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో సినీ ప్రముఖులందరూ వచ్చి ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకుని సినిమా షూటింగ్లకు వెళ్లిపోయారు. రెండు ప్యానల్స్ తో ఎన్నికల అధికారి చర్చలు జరుపుతున్నారు.

Also Read : నిన్న కవ్వింతలు ఇవాళ కౌగిలింతలు

Show comments