Idream media
Idream media
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక దాదాపు అన్ని పొలిటికల్ పార్టీలు కూడా తమ అభిమానులు, అనుచరులకు సోషల్ మీడియాలో ఎక్కువగా అందుబాటులో ఉంటున్నాయి. ఎప్పటికప్పుడు పార్టీ కార్యక్రమాలు అప్డేట్స్ లాంటివి కూడా ఆయా అధికారిక ఖాతాల ద్వారా చేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కు గురయింది. శనివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో మొదలైన ఈ హ్యాకింగ్ కారణంగా పదుల సంఖ్యలో ట్వీట్లు కనిపిస్తున్నాయి. Awesome, Love this అంటూ అనేక రకమైన ట్వీట్లు కనిపిస్తున్నాయి. ఈ తెలుగుదేశం అఫీషియల్ అకౌంట్ కి 515 K ఫాలోవర్స్ ఉన్నారు.ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ ను ప్రమోట్ చేసే విధంగా ఈ ట్వీట్లు కనిపిస్తున్నాయి..
గతంలో కూడా అనేకసార్లు ఇదేవిధంగా బిట్ కాయిన్ కి సంబంధించిన కొందరు హ్యాకర్లు భారతదేశానికి సంబంధించిన కొంతమంది సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలను ఇలాగే హ్యాక్ చేశారు. ఆ తర్వాత వాటిని మళ్ళీ ట్విట్టర్ పునరుద్ధరించింది. గతంలో ప్రధానమంత్రి మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వంటి వారి అకౌంట్లు కూడా ఇదే విధంగా హ్యాక్ అయ్యాయి. ప్రధానమంత్రి మోడీ ఖాతా హ్యాక్ అయిన సమయంలో భారత్ లో బిట్ కాయిన్‌లను లీగల్ చేశామని వాటిని కొనాలని ట్వీట్ చేశారు. 500 బిట్ కాయిన్‌లు పంచుతున్నామంటూ హ్యాకర్లు అప్పట్లో లింకు ట్వీట్ చేశారు. దీంతో అప్రమత్తమైన పీఎంవో అధికారులు ట్విట్టర్ సంస్థకు సమాచారం ఇచ్చారు.
దీంతో ప్రధాని ఖాతాను పునరుద్ధరించారు. అలా ప్రధాని సహా అనేకమంది టాప్ టెక్ దిగ్గజాలు, బిలియనీర్ల ట్విట్టర్ అకౌంట్లు హ్యాకింగ్ కు గురైన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు టీడీపీ అఫీషియల్ అకౌంట్ హ్యాక్ కావడం అందులోనూ బిట్ కాయిన్ సంబంధిత, ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ కు సంబంధించిన గురించి పోస్టింగ్ పెట్టడం మీద చర్చ మొదలైంది. ఇక దీని మీద నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. టీడీపీ అకౌంట్ హ్యాక్ కు గురికావడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. టెక్నాలజీ పితామహుడిని అని చెప్పుకుంటున్న చంద్రబాబు ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి కదా అని కామెంట్ చేస్తున్నారు.