Huzurabad, Revanth – రేవంత్ కు హుజూరా”బ్యాడ్” క‌ష్టాలు

కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియ‌మితులైన త‌ర్వాత తెలంగాణ లో ఆ పార్టీ జోరు పెరిగింద‌ని, ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు గ‌ట్టి పోటీ ఇచ్చేలా త‌యారైంద‌ని, ఇత‌ర పార్టీల నేత‌లు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నార‌ని.. ఇలా ఎన్నోన్నో ప్ర‌చారాలు జ‌రిగాయి. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మెజార్టీ సీట్లు సాధించి కేసీఆర్ కోట‌ను కూలుస్తామంటూ రేవంత్ స్పీచ్ లు ఇర‌గ‌దీస్తున్నారు. వ‌రుస‌గా స‌భ‌లు, స‌మావేశాలు పెడుతూ పార్టీని ప్ర‌జాక్షేత్రంలో బ‌లోపేతం చేస్తున్న‌ట్లుగా చెప్పుకుంటున్నారు. తీరా చూస్తే.. రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక ఎదుర్కొన్న తొలి ఎన్నిక‌ హుజూరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఘోరాతి ఘోరమైన ఫ‌లితం చ‌విచూసింది. సాంప్ర‌దాయ ఓట్ల‌ను కూడా రాబ‌ట్టుకోలేక పోయింది. గ‌త ఎన్నిక‌ల ఫ‌లితాలు, నేటి ఫ‌లితాల‌కు ఎక్క‌డా ద‌రిదాపుల్లో కూడా లేదు. కేవ‌లం 1.46% ఓట్ల‌ను మాత్ర‌మేభాగస్వామ్యం

తాజా ఉప ఎన్నిక ఫ‌లితాల‌పై కాంగ్రెస్ నేత‌లు కంగుతిన్నారు. బ‌లోపేతం అవుతున్నామనుకుంటున్న త‌రుణంలో ఇంత ఘోర‌మైన ప‌రిస్థితి ఏంట‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు. మ‌రోవైపు.. అధిష్టానం కూడా దీనిపై గుర్రుగా ఉంది. ఎందుకింత ఘోర‌మైన ప‌రిస్థితిని ఎదుర్కోవాల్సి వ‌చ్చిందో తెలుసుకునే ప‌నిలో నిమ‌గ్న‌మైంది. దారుమైన ఫలితాలు రావడంతో రాష్ట్ర నాయ‌కుల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సాంప్రదాయబద్ధంగా వస్తున్న ఓటు బ్యాంకుకు చిల్లు పడటంతో పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది.

హుజురాబాద్ విషయంలో ఏం జరిగిందనేది తెలుసుకునేందుకు ఢిల్లీకి రావాల్సిందిగా పిలుపు నిచ్చింది. ఇప్పటి వరకు అనేక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైనప్పటికీ.. హుజురాబాద్ విషయంలో జీర్ణం చేసుకోలేకపోతుంది. అనేక ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయినా.. హుజురాబాద్ విషయంలో మాత్రం సీరియస్ గా తీసుకుంది..హుజురాబాద్ ఫలితం పై రాష్ట్ర కాంగ్రెస్ లో సీనియర్లు సైతం గుర్రుగా ఉన్నారు.

ఈ మధ్య కాలంలో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : Bjp Central Minister,Warns To Kcr -ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు, కేసీఆర్ కు కేంద్రం వార్నింగ్…?

సీనియర్ నేత వీహెచ్ ఈ ఫలితం పై రివ్యూ జరగాలని గట్టి పట్టు పట్టారు. దీంతో మాణిక్కం ఠాగూర్ రివ్యూ చేస్తామన్నారు. అధిష్టానం ఆదేశంతో కర్ణాటక మాజీ ఎమ్మెల్యే నంజన్యన్ మత్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు. కర్ణాటక కు చెందిన మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కమిటీ పని ప్రారంభం కాక ముందే .. రాష్ట్ర నేతలను ఢిల్లీకి రావాల్సిందిగా పిలుపునిచ్చారు. ముఖ్య నేతలందరినీ రావాలని ఆదేశాలు జారీ చేసింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ లు .. ఎన్నికల్లో భాగస్వామ్యం అయిన నేతలను ఆహ్వానించారు. అయితే ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి మొదట్లో పిలుపు అందినా తర్వాత నిలిపేశారు. మహేశ్వర్ రెడ్డి ప్లేస్ లో ములుగు ఎమ్మెల్యే సీతక్కను ఢిల్లీకి రావాల్సిందిగా ఆహ్వానించారు.

రేవంత్ రెడ్డి మాట‌ల్లో, చేత‌ల్లో పైకి క‌నిపించినంత చ‌రిష్మా.. ప్ర‌జ‌ల్లో లేద‌ని హుజురాబాద్ ఎన్నిక‌ల ఫ‌లితాల ద్వారా వెల్ల‌డైంద‌నే చ‌ర్చ మొద‌లైంది. దీనికి తోడు అధిష్టానం కూడా పోస్ట్ మార్టమ్ మొద‌లుపెట్ట‌డం పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్, బీజేపీల‌కు గ‌ట్టి పోటీ ఇవ్వాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్న త‌రుణంలో ఈ ఉప ఎన్నిక పార్టీకి కంట్లో న‌లుసుగా మారింది. మూడో స్థానంలో కేవ‌లం మూడు వేల ఓట్ల‌తో స‌రిపెట్టుకోవాల్సి రావ‌డం కోలుకోలేని దెబ్బ తీసింది. ఈ క్ర‌మంలో అధిష్టానం మీటింగ్ కీల‌కంగా మారింది. స‌మావేశం అనంత‌రం పార్టీలో ఎటువంటి మార్పులు జ‌రుగుతాయో వేచి చూడాలి.

Also Read : TRS District Presidents -టీఆర్ఎస్ లో జిల్లా అధ్య‌క్షుల శకం ముగిసిన‌ట్లేనా?

Show comments