కాంగ్రెస్ అధిష్టానానికి రేణుకా చౌదరి వార్నింగ్! ఎందుకంటే?

కాంగ్రెస్ అధిష్టానానికి రేణుకా చౌదరి వార్నింగ్! ఎందుకంటే?

తెలంగాణలో ఎన్నికల సందర్భంగా తమకు సీట్లు కేటాయించకుంటా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలు మారుతున్నారు.

తెలంగాణలో ఎన్నికల సందర్భంగా తమకు సీట్లు కేటాయించకుంటా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలు మారుతున్నారు.

తెలంగాణలో ఎన్నికల వేల అధికార, ప్రతిపక్ష పార్టీల్లో నిరసనల పర్వం కొనసాగుతుంది. తమ వర్గీయులకు సీట్లు కేటాయంచలేదని నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఏకంగా పార్టీలు కూడా మారుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇటీవల 55 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా రిలీజ్ చేసింది. రెండవ జాబితా విడుదల విషయంలో ఆలస్యం అవుతూ వచ్చింది. తాజాగా కాంగ్రెస్ లో టిక్కెట్ల కేటాయింపు విషయంలో ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే..

శుక్రవారం ఢిల్లీలోని ఏఐసీసీ పెద్దల మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా వారికి కలిసి మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి కాంగ్రెస్ పార్టీలో కమ్మ కులానికి ఎక్కువ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో సామాజిక న్యాయం జరగడం లేదని.. బయట నుంచి వచ్చిన వాళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో డబ్బు ఉన్నవాళ్లకే కాదు.. దమ్మున్న వాళ్లకు కూడా సీట్లు కేటాయించాని డిమాండ్ చేశారు. ఈసారి జరగబోయే ఎన్నికల్లో కమ్మ కులానికి చెందిన వారికి గుర్తించాలని.. తమకు జరుగుతున్న అన్యాయంపై వారంతా చాలా కోపంగా, ఉద్రేకంగా ఉన్నారని అన్నారు.

కమ్మ కులానికి సీట్లు ఇస్తే.. మా ఓట్లు కాంగ్రెస్ పార్టీకే వస్తాయని అన్నారు. మిగతా పార్టీల వాళ్లు కమ్మ సామాజిక వర్గానికి పిలిచి మరీ సీట్లు కేటాయిస్తుంటే.. కాంగ్రెస్ పార్టీవాళ్లు మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా కమ్మ వర్గానికి ఇవ్వలేదు. మరో వర్గానికి ఏకంగా 38 సీట్లు కేటాయించడంతో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఇతర పార్టీలోకి వెళ్లిపోతున్నారు. ఇప్పటికైనా కమ్మ కులస్తులకు సీట్లు కేటాయించాలి.. లేకుండా ఈసారి కూడా వారి ఆగ్రహానికి మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

Show comments