Swetha
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి ఏటా నిర్వహిస్తున్న ద్రవ్య విధాన కమిటీ సమావేశాల తర్వాత కొత్త విధివిధానాలు రూపుదిద్దుకుంటాయి. ఈ క్రమంలో ఈ ఏడాది ప్రజలంతా ఈఎమ్ఐలు తగ్గుతాయా అనే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి ఏటా నిర్వహిస్తున్న ద్రవ్య విధాన కమిటీ సమావేశాల తర్వాత కొత్త విధివిధానాలు రూపుదిద్దుకుంటాయి. ఈ క్రమంలో ఈ ఏడాది ప్రజలంతా ఈఎమ్ఐలు తగ్గుతాయా అనే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Swetha
ప్రతి ఏటా ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలో ద్రవ్య విధాన సమావేశాలను ఏర్పాటు చేస్తారు. ఈ సమావేశాలలో దేశ ఆర్థిక వ్యవస్థ గురించి చర్చలు జరుపుతూ.. కొత్త విధివిధానాలను అమలులోకి తీసుకుని వస్తారు. అంటే దేశంలో నగదు లభ్యత ఎలా ఉండాలి, వడ్డీ రేట్లు ఎలా ఉండాలి వంటి అతి కీలక నిర్ణయాలను తీసుకుంటారు. స్థిరమైన ఆర్థిక వృద్ధిని కొనసాగించేందుకు .. రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా ఈ విధానాన్ని అమలు చేస్తోంది. దీని ముఖ్య ఉద్దేశం దేశ ఆర్థిక వ్యవస్థను భారీ కుదుపులకు లోను కాకుండా చూసుకోవడం. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి 6 మంగళవారం రోజున ఈ ద్రవ్య విధాన కమిటీ సమావేశం జరగబోతుంది. ఈసారి ప్రజలంతా వారు చెల్లించే ఈఎమ్ఐలు ఏమైనా తగ్గుతాయా! అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న ఈ ద్రవ్య విధాన కమిటీ సమావేశాన్ని .. మధ్యంతర బడ్జెట్ ముగిసిన వెంటనే ఏర్పాటు చేయనున్నారు. ఫిబ్రవరి 6న ఈ సమావేశం ప్రారంభం కానుంది. అయితే ఈ సమావేశాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఆ తరువాత ఈ సమావేశంలో తీసుకున్న ధరల నిర్ణయాలను .. ఫిబ్రవరి 8న .. ఉదయం పది గంటల సమయంలో .. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించనున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాదైనా తాము ప్రతి నెల చెల్లిస్తున్న లోన్ ఈఎంఐల ధరలు కాస్తయినా తగ్గుతాయేమో అని.. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. మరో వైపు ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక ప్రకారం.. ఈసారి జరగబోయే ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో.. రేపో రేటు ధరలలో తగ్గింపు ఉండకపోవచ్చని.. గత రేట్లు యధాతధంగా కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది.
కాగా, అసలు ఈ రెపో రేటు అనేది ఆర్‌బీఐ ఇతర బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేటు. గతంలో జరిగిన సమావేశంలో ఆర్‌బీఐ పాలసీ.. ఈ రెపో రేటును 6.5 శాతంగా వెల్లడించింది. అయితే ఈ ఏడాది యథాతథంగా కొనసాగించాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. కాబట్టి ఇక రానున్న ఆర్థిక సంవత్సరంలో.. మొదటి రెపో రేటు తగ్గింపు వచ్చే జూన్ లో ఉండవచ్చని.. ఎస్‌బీఐ రీసెర్చ్ అంచనా వేసింది. అయితే, గత ఏడాది ఫిబ్రవరిలోనే ఆర్బీఐ చివరిసారిగా ఈ రెపో రేటును మార్చి.. వడ్డీ రేట్లను 0.25 శాతం పెంచింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఐదు సమావేశాలు జరిగినా ఈ రెపో రేట్లలో ఎటువంటి మార్పు కనిపించలేదు. ఇక ఈసారి జరుగబోయే సమావేశాలలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి.