Idream media
Idream media
గత మూడు రోజులుగా మోదీ గురించి సోషల్ మీడియాలో ఓ విశేషమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఎదుటివారికి చెప్పడమే కాదు.. పాటించే నాయకుడంటూ నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే మోదీ దాతృత్వం గురించి. పదువుల్లో ఉండగా లక్షల కోట్లు కూడబెట్టి తరతరాలకు సరిపడా ఆస్తులు సంపాదించాలని ఆరాటపడే రాజకీయ నాయలకు ఆదర్శంగా ప్రధాని నరేంద్ర మోదీ నిలుస్తారనడంలో అతిశయోక్తి లేదంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకు నిదర్శనమే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇప్పటి వరకు వివిధ కార్యక్రమాల కోసం 103 కోట్ల రూపాయల విరాళాలు అందించడం. ఇందులో వేలం ద్వారా సమకూరిన మొత్తం కొంత ఉండగా, వ్యక్తిగత పొదుపు మొత్తం కొంత ఉంది. పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళం ఇచ్చిన మొదటి వ్యక్తి కూడా మోదీయే. రూ. 2.52 లక్షలు విరాళం ఇచ్చారు. కరోనా మహమ్మారి లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఈఏడాది మార్చిలో పీఎంకేర్స్ ఫండ్‌ను ఏర్పాటు చేశారు. అలాగే, బాలికా విద్య, క్లీన్ గంగా మిషన్, అణగారిన వర్గాల సంక్షేమం వంటి మరెన్నో కార్యక్రమాలకు మోదీ విరాళాలు ఇచ్చినట్టు తెలుస్తోంది.
పారిశుధ్య సిబ్బంది కోసం.. గంగా నది ప్రక్షాళన కోసం..
మోదీ గతేడాది జరిగిన కుంభమేళాలో పనిచేసిన పారిశుధ్య సిబ్బంది సంక్షేమం కోసం రూ. 21 లక్షలు విరాళంగా ఇచ్చారు. ప్రధాని నరేంద్రమోదీకి దక్షిణ కొరియా గతేడాది సియోల్ పీస్ ప్రైజ్‌ను అందించింది. ఆ ప్రైజ్ ద్వారా వచ్చిన రూ. 1.3 కోట్ల మొత్తాన్ని గంగా నది ప్రక్షాళన కోసం చేపట్టిన నమామి గంగా ప్రాజెక్టుకు విరాళంగా ప్రకటించారు. అలాగే, తనకు వచ్చిన మెమెంటోలను వేలం వేయడం ద్వారా వచ్చిన రూ. 3.40 కోట్ల మొత్తాన్ని కూడా నమామి గంగా ప్రాజెక్టుకే మోదీ ఇచ్చేశారు. అంతేకాదు, అంతకుముందు తనకు వచ్చిన బహుమతులనను వేలం వేయగా వచ్చిన రూ. 8.35 కోట్ల మొత్తాన్ని కూడా అదే ప్రాజెక్టుకు అందించారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తన వ్యక్తిగత పొదుపు నుంచి రూ. 21 లక్షలను రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పిల్లల విద్య కోసం విరాళంగా అందించారు. అలాగే, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు వచ్చిన బహుమతులను వేలం వేయడం ద్వారా సమకూరిన రూ. 89.96 లక్షలను బాలిక విద్య కోసం ఉద్దేశించిన కన్య కలావాణి ఫండ్‌కు అందించారు. ఇలా రకరకాల కార్యక్రమాలకు మోదీ విరాళాలు అందించి నేటి రాజకీయ నాయకులకు భిన్నంగా నిలిచారు.