Love Mouli Movie Review: బోల్డ్‌గా వచ్చిన నవదీప్‌ లవ్‌ మౌళి సినిమా ఎలా ఉందంటే..

చాలా రోజుల తర్వాత నవదీప్‌ లవ్‌ మౌళి చిత్రంతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది.. అంటే..

చాలా రోజుల తర్వాత నవదీప్‌ లవ్‌ మౌళి చిత్రంతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది.. అంటే..

లవ్‌ మౌళి

07-06-2024, డ్రామా, రోమాంటిక్‌, 2H 26M A
A
  • నటినటులు:నవదీప్‌, పంకూరి గిద్వానీ, చార్వి దత్తా, మిర్చి హేమంత్‌ తదితరులు
  • దర్శకత్వం:అవ‌నీంద్ర
  • నిర్మాత:సి స్పేస్
  • సంగీతం:గోవింద్‌ వసంత్‌
  • సినిమాటోగ్రఫీ:అజయ్ శివశంకర్

Rating

2.25

సుమారు 20 ఏళ్ల క్రితం జై సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయం అయ్యాడు నవదీప్‌. ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది. ఆ తర్వాత వరుస సినిమాల్లో హీరోగా నటించాడు. వీటిల్లో గౌతమ్‌ ఎస్‌ఎస్‌సీ కాస్త పర్వాలేదనిపించింది. ఆ తర్వాత చందమామ సినిమాతో మరోసారి హిట్టు కొట్టాడు నవదీప్‌. ఇక ఆర్యలో అతడు చేసిన పాత్ర.. నవదీప్‌ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ తర్వాత కేవలం హీరోగా మాత్రమే కాక విలన్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా చేస్తూ వచ్చాడు. యాంకర్‌గా, ఓటీటీ వెబ్‌ సిరీస్‌లలో నటిస్తున్నాడు. ఈ క్రమంలో చాలా రోజుల తర్వాత లవ్‌ మౌళి చిత్రంతో మరోసారి హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నవదీప్‌. మరి ఈ సినిమా ఎలా ఉందంటే..

కథ:

మౌళి (నవదీప్) తల్లిదండ్రులు చిన్నప్పుడే విడిపోవడంతో తాతయ్య దగ్గర పెరుగుతాడు. కొన్నాళ్లకు ఆయన కూడా మృతి చెందడంతో.. ఇక తనకు ఇష్టం వచ్చినట్లు బతుకుతాడు. మౌళి మంచి పెయింటర్‌.. మేఘాలయాలో ఉంటాడు. ఓ రోజు అనుకోకుండా అడవుల్లో అఘోరాతో ప్రేమ విషయమై గొడవ పడగా.. అప్పుడా అఘోరా ఓ పెయింట్ బ్రష్‌ని సృష్టించి ఇస్తాడు. కొన్నాళ్ల తర్వాత దానితో ఓ అమ్మాయి బొమ్మ గీయగా, అందులో నుంచి నిజంగానే చిత్ర(పంఖురి గిద్వాని) అనే అమ్మాయి బయటకొస్తుంది. ఆమెతో గొడవ అయ్యేసరికి మరోసారి చిత్ర బొమ్మ గీస్తాడు. ఈసారి ఆమె డిఫరెంట్‌ పర్సనాలిటీతో వస్తుంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది.. చివరకు మౌళి ప్రేమ గురించి తెలుసుకున్నాడా లేదా అన్నదే సినిమా.

విశ్లేషణ..

‘లవ్ మౌళి’ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఓ రోటిన్‌ ప్రేమ కథా చిత్రం. కాకపోతే దీనికి ఓ ఫాంటసీ ఎలిమెంట్ జోడీంచడం వల్ల స్క్రీన్ ప్లే కాస్త కొత్తగా అనిపించింది. ప్రేమ అంటే ఏంటని తెలుసుకునే క్రమంలో మౌళి ఏం తెలుసుకున్నాడు అనే పాయింట్‌తో ఈ చిత్రం తెరకెక్కించారు. అయితే ఫస్టాఫ్‌ కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది. కానీ సెకండాఫ్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే ఈ మూవీ స్టోరీకి తగ్గట్లు లోకేషన్స్, మ్యూజిక్ అదిరిపోయింది. కథంతా మేఘాలయలోనే జరుగుతుంది కాబట్టి.. ఎక్కువ సన్నివేశాలు అక్కడే చిత్రీకరించారు. విజువల్‌గా వండర్‌ఫుల్‌గా ఉంది అని చెప్పవచ్చు.

ప్రేమలో ఉన్న వారు.. పెళ్లి చేసుకున్న వారు ప్రతి ఒక్కరు లవ్‌ మౌళి సినిమాతో ఏదో ఒక సందర్భంలో కనెక్ట్‌ అవుతారు. సినిమాలో ముద్దు సీన్స్, బోల్డ్ సన్నివేశాలు బాగానే ఉన్నాయి. చాలా వరకు ముద్దు సీన్స్ సహజంగానే అనిపించినా ఒకటి రెండు బోల్డ్ సీన్స్ మాత్రం అవసరమా అనిపిస్తాయి. కథని ఎంత కొత్తగా చూపించినా చివరకు అందరూ చెప్పేదే చెప్పడంతో క్లైమాక్స్‌ రొటీన్‌ అనిపిస్తుంది.

ఎవరెలా చేశారంటే..

లవ్‌ మౌళి ప్రమోషన్స్‌ వేళ.. ఈ సినిమా నవదీప్‌ కెరీర్‌కు 2.o లాంటిది అని చెప్పారు. అందుకు తగ్గట్టుగానే నవదీప్‌ కూడా ఈ చిత్రం కోసం బాగానే కష్టపడ్డాడు. మరోసారి తన యాక్టింగ్‌ స్కిల్స్‌ను ప్రూవ్‌ చేసుకున్నాడు. ఇక హీరోయిన్ చిత్ర పాత్ర చేసిన పంఖురి గిద్వాని సూపర్‌గా చేసింది. హారికగా నటించిన భావన సాగి పర్వాలేదనిపించింది. మిగిలిన పాత్రలు ఓకే. ఈ చిత్రంలో అసలు సర్‌ప్రైజ్‌ రానా దగ్గుబాటి. అవును లవ్‌మౌళి సినిమాలో రానా అఘోరాగా గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చి అదరగొట్టేసాడు.

టెక్నికల్ విషయాలకొస్తే.. లొకేషన్స్ అదిరిపోయాయి. మేఘాలయని అద్భుతంగా చూపించారు. దర్శకుడే సినిమాటోగ్రాఫర్ కావడంతో ఔట్‌పుట్ అదిరిపోయింది. గోవింద్ వసంత, కృష్ణ ఇచ్చిన సంగీతం సరిగ్గా సరిపోయింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల బాగుంటుంది. అవనీంద్ర, దర్శకుడిగా ఆకట్టుకున్నాడు. నిర్మాణ విలువల మూవీకి తగ్గట్లు ఉన్నాయి.

బలాలు:

  • నవదీప్‌ యాక్టింగ్‌
  • రానా గెస్ట్‌ అప్పియరెన్స్‌
  • లోకేషన్స్‌

బలహీనతలు:

  • ఫస్టాప్‌ సాగతీత
  • రొటీన్‌ క్లైమాక్స్‌

చివరి మాట: లవ్‌ మౌళి కొందరికి మాత్రమే కనెక్ట్‌ అయ్యే లవ్‌ స్టోరి.

Show comments