iDreamPost
iDreamPost
ప్రస్తుతం చివరి దశలో ఉన్న లవ్ స్టోరీ షూటింగ్ పూర్తి చేయడంలో బిజీగా ఉన్న నాగ చైతన్య ఇది కాగానే విక్రమ్ కుమార్ రూపొందించబోయే థాంక్ యులో జాయినవుతాడు. దిల్ రాజు నిర్మాణం కాబట్టి అంచనాలు అప్పుడే మొదలయ్యాయి. దీని తర్వాత వెంకీ అట్లూరితో చేయోచ్చనే టాక్ వచ్చింది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఓ స్టొరీ చెప్పాడని, లైన్ నచ్చిన చైతు దాన్ని డెవలప్ చేయమని సిగ్నల్ ఇచ్చినట్టుగా చెప్పుకున్నారు. ఫైనల్ అయ్యేదాకా కన్ఫర్మేషన్ ఇవ్వలేం కానీ చైతు ఈలోగా మరో ప్రాజెక్ట్ కూడా చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ టైంలో విడుదలైన వెబ్ సిరీస్ లూజర్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న అభిలాష్ దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నాడట.