సినిమా vs సీరియల్ – Nostalgia

సినిమాల‌కి, టీవీ సీరియ‌ళ్ల‌కి 10 ప్ర‌ధాన‌మైన తేడాలు-GR Maharshi1)

సినిమాల్లో మ‌గ‌వాళ్లు విల‌న్లు.సీరియ‌ల్స్‌లో ఆడ‌వాళ్లు విల‌న్లు

సినిమాలు Maximum మూడు గంట‌లుంటాయిసీరియ‌ల్స్ 3 ఏళ్లు లేదా 30 ఏళ్లు ఉండొచ్చు.ఒక్కోసారి మ‌న జీవిత‌కాల‌మంతా కూడా ఉండొచ్చు

3) సినిమాల్లో హీరో ఉంటాడు. సీరియ‌ల్స్‌లో హీరోయిన్స్ ఉంటారు. హీరో ఉన్నా డ‌మ్మీగా ఉంటాడు.

4) సీరియ‌ల్స్‌కి ఆఫ్ చేసుకునే అవ‌కాశం ఉంటుంది. సినిమాలో కూచుంటే, బాదుడికి సిద్ధ‌ప‌డాలి.

5) సినిమాల్లో అత్త‌లు కోడ‌ళ్లు మాయ‌మై చాలా కాల‌మైంది. సీరియ‌ల్స్‌లో వాళ్లే Lead Roles

6) సినిమాల‌కి పాప్‌కార్న్‌, టీ, కాఫీ Extra సీరియ‌ల్స్ హోంపుడ్స్ తింటూ చూడొచ్చు.

7) సినిమాలో హీరోయిన్ ఏడుస్తుంద‌న్న గ్యారెంటీ లేదు. సీరియ‌ల్స్‌లో హీరోయిన్ ఎంత ఏడిస్తే అంత రేటింగ్‌. 

😎 సినిమా నాన్‌స్టాఫ్‌గా ఉతుకుతుంది.
సీరియ‌ల్ ఇన్‌స్టాల్‌మెంట్‌లో ఉతుకుతుంది.

9) సినిమాలో హీరో వాగుతూ ఉంటాడు. సీరియ‌ల్‌లో ఆడ‌వాళ్లు మాత్ర‌మే మాట్లాడుతారు. మ‌గాళ్లు నోట్లో నాలుక లేకుండా “అంతేగా అంతేగా” అంటూ ఉంటారు.

10) శ‌బ్ద కాలుష్యం, భావ కాలుష్యంలో రెంటికీ తేడా లేదు.

Show comments