Idream media
Idream media
అనారోగ్యంతో తుది శ్వాస విడిచిన మావోయిస్టు పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్‌కే)కు మావోయిస్టు పార్టీ తుది వీడ్కోలు పలికింది. ఈ నెల 14వ తేదీన ఆర్‌కే తుది శ్వాస విడిచారని, విప్లవవీరుల సమక్షంలో అంత్యక్రియలు పూర్తి చేశామని నిన్న శనివారం ఆ పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఓ ప్రకటన విడుదలైంది. తాజాగా ఆర్కే అంత్యక్రియలకు సంబంధించిన చిత్రాలను మావోయిస్టు పార్టీ విడుదల చేశారు.
తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఆర్కే అంత్యక్రియలు పూర్తి చేశారు. పామేడు – కొండపల్లి సరిహద్దు ప్రాంతంలో తమ నేతకు మావోలు, గిరిజనులు కన్నీటి వీడ్కోలు పలికారు.
ఆర్కే అంత్యక్రియల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు పాల్గొన్నారు. మావోయిస్టు పార్టీ లాంఛనాలతో ఆర్కే అంత్యక్రియలు జరిపారు. ఆర్కే పార్థీవ దేహంపై ఎర్రజెండాను కప్పారు.
అంత్యక్రియల్లో మావోయిస్టులతోపాటు భారీ సంఖ్యలో గిరిజనులు హాజరయ్యారు. తమ సాంప్రదాయాల మేరకు ఆర్కేకు ఘన నివాళి అర్పించిన గిరిజనులు, ఆయనకు తుది వీడ్కోలు పలికారు.
Also Read: Maoist RK – మావోయిస్టు అగ్రనేత ఆర్‌కే ఇక లేరు..?
Also Read: Maoist RK Died : ఆర్కే నిజంగా చనిపోయాడా, ఎవరు దృవీకరించాలి?
Also Read: RK Death – దివికేగిన ఆర్కే.. ధృవీకరించిన మావోయిస్టు పార్టీ