Idream media
Idream media
కొట్టను బాబో అని వెనకాడుతున్న మహేష్ బాబును ‘హిట్.. హిట్ మీ యార్..!! ఏం భయమా? గౌరవమా? వెక్కిరించి, రెచ్చగొట్టి మరీ కుళ్లబొడిపించుకున్న బ్రహ్మీ సన్నివేశం గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం చంద్రబాబు పరి స్థితి కూడా అలాగే ఉంది. స్థానిక ఎన్నికలు పెడితే మా సత్తా చూపుతాం.. ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో ఈ దెబ్బతో తేలిపోతుంది.
ఓటమి భయంతోనే జగన్ లోకల్ ఎన్నికలకు వెనుకాడుతున్నాడు అంటూ ముఖ్యమంత్రి జగన్ను వెక్కిరించిన చంద్రబాబుకు తాజా పంచాయతీ ఎన్నికల్లో తన అసలు బలం బాగానే తెలిసొచ్చింది. ఉద్దండపిండాలు.. లేస్తే మనిషి కాదు.. నియోజకవర్గంలో ఆయన్ను కొట్టడం అసాధ్యం… వారితో చెలగాటం కష్టమే అని బోలెడు ట్యాగ్ తగిలించుకున్న నాయకులెవరికి పంచాయతీ ఎన్నికల్లో నిలువనీడ లేకపోయింది.
దేవినేని ఉమ,పరిటాల,అచ్చెన్న, కోడెల శివప్రసాద్ ఇలా ఒకరా టీడీపీ అధికారంలో ఉన్న రోజుల్లో కళ్లు నడినెత్తిన
ఉన్నట్లుగా భావించి విర్రవీగిన నాయకులందరికి పంచాయతీ ఎన్నికలు జీవితాంతం గుర్తుండిపోతాయి. పార్టీ అధినేత చంద్రబాబు సారథ్యం వహించిన కుప్పంలోను, పార్టీ రాష్ట్ర అచ్చెన్నాయుడి టెక్కలిలోను సీనియర్ అయ్యన్నకు చెందిన నర్సీపట్నం లోను, థింక్ ట్యాంకు అని ఫీలయ్యే యనమల కు సైతం అంచనాలు అందలేదు. జగన్ గత అసెంబ్లీ ఎన్నికల్లో సృష్టించిన సునామీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా సమీపంలోని గ్రామాలను ముంచెత్తుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు రెండు విడతల ఎన్నికల్లో ప్రతి నియోజక వర్గంలో దాదాపుగా 85 శాతానికి పైగా వైఎస్సార్ కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లాయి.
బొబ్బిలిలో బేబీ నాయిన మంత్రం!!
రాష్ట్రం మొత్తం ఎలా అయినా ఉండనీ… కానీ బొబ్బిలి నియోజకవర్గంలో మాత్రం మాజీ మంత్రి సు జయ్ కృష్ణ రంగా రావు సోదరుడు బేబీనాయన తన పట్టును నిలుపుకున్నారు. రామభద్రపురం, బొబ్బిలి, తెర్లాం, బాడంగి మండలాల్లో దాదాపు 45కి పైగా పంచాయతీల్లో తన మద్దతుదారులు గెలిచేందుకు బాటలు వేశారు. దాదాపుగా 105 పంచాయితీలున్న ఈ నియోజకవర్గంలో మేజర్ పంచాయతీలు బేబీ బలపర్చిన తెలుగుదేశం అభ్యర్థులు గెలుపొందారు.
గెలిచినవారిని టీడీపీ వాళ్లు అవడం కన్నా బేబీ నాయన సొంత క్యాడర్ అవడం సముచితం. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి • సంబంగి వెంకట చినప్పలనాయుడు చేతిలో అప్పటి మంత్రి, బేబీకి పెద్దన్నయ్య అయిన సుజయ్ ఓడిపోయారు. ఆ తరువాత ఆయన దాదాపుగా ప్రజలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
అయితే బొబ్బిలి ఇన్ చార్జిగా బేబీనాయన్ను నియమించిన పార్టీ అధిష్టానం ఆయనకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడంతో బొబ్బిలితోబాటు పార్వతీపురం నియోజకవరంలోని సీతానగరం, బలిజీపేట మండలాల్లోనూ తన మద్దతుదారులను ఆయన గెలిపించుకున్నారు. నిరంతరం ప్రజల్లో ఉండడము,ఎవరికి ఏకష్టం వచ్చినా వెనువెంటనే అక్కడ ప్రత్యక్షమవడం, బేషజాలు లేకుండా సాధారణ జనంతో కలిసిపోవడం వంటి లక్షణాలు ఆయన్ను ప్రజల్లో నాయకుడిగా నిలబెట్టాయి. ఆయన చెప్పిన వారికి ఓటేసేలా చేశాయి. రాష్ట్రం మొత్తం మీద ఏ నియోజకవరంలోనూ తెలుగుదేశం ఇంత మంచి ఫలితాలు సాధించలేదని చెప్పవచ్చు ఇక్కడ తెలుగుదేశం బలంగా ఉందనడం కన్నా బేబీ నాయనకు ఆదరణ ఉందన్నదే సుస్పష్టం