KL Rahul takes unbelievable catch: VIDEO: కేఎల్‌ రాహుల్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌! రోహిత్‌, కోహ్లీ రియాక్షన్‌ చూడండి

VIDEO: కేఎల్‌ రాహుల్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌! రోహిత్‌, కోహ్లీ రియాక్షన్‌ చూడండి

వన్డే వరల్డ్ కప్ లో భాగంగా పూణే వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య లీగ్ మ్యాచ్ జరుగుతోంది. ప్రపంచకప్ లో భారత్ కు ఇది నాలుగో లీగ్ మ్యాచ్. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లపై విజయ దుందుభి మోగించి హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. నేడు జరిగే మ్యాచ్ లో సైతం విజయం సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగింది రోహిత్ సేన. అయితే భారత్, బంగ్లా మ్యాచ్ లో అద్భుతమైన ఘట్టం చోటుచేసుకుంది. క్లాసీ మ్యాన్ కేఎల్ రాహుల్ స్టన్నింగ్ క్యాచ్ పట్టి ఔరా అనిపించాడు. రాహుల్ అందుకున్న క్యాచ్ వరల్డ్ కప్ కే హైలైట్ గా మారింది.

భారత్, బంగ్లా మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ను ఎంచుకుంది. దీంతో బౌలింగ్ కు దిగిన టీమిండియా మొదట్లో బంగ్లా బ్యాటర్లను కట్టడి చేసే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత బంగ్లా ఓపెనర్లు బ్యాటు ఝుళిపించి అర్ధ సెంచరీలతో మెరిసారు. ఇలా జరుగుతున్న మ్యాచ్ లో అద్భుతం ఆవిష్కృతమైంది. టీమిండియా పేస్ బౌలర్ సిరాజ్ వేసిన 24వ ఓవర్లో మొదటి బంతికి బంగ్లా బ్యాటర్ మెహిదీ హసన్ కేఎల్ రాహుల్ కు క్యాచ్ రూపంలో దొరికిపోయాడు.

వికెట్ల వెనకాలే ఉన్నా కేఎల్ రాహుల్ హసన్ ఆడిన బంతి గాల్లోకి ఎగరగా రాహుల్ గోల్ కీపర్ మాదిరిగా తన ఎడమవైపు గాల్లోకి ఎగిరి ఒంటిచేతితో బంతిని ఒడిసిపట్టాడు. రాహుల్ అందుకున్న ఆ క్యాచ్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. టీమిండియా దిగ్గజ బ్యాటర్లైన హిట్ మ్యాన్, కింగ్ కోహ్లీ రాహుల్ వద్దకు పరుగెత్తుకెళ్లి అభినందించారు. సిరాజ్ అద్భుతమైన డెలివరీ చేసినా రాహుల్ స్టన్నింగ్ క్యాచ్ అందుకోవడంతో సర్ ప్రైజ్ అయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత బౌలర్లు విజృంభించడంతో 33 ఓవరల్లో బంగ్లాదేశ్ 4 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి ఆటను కొనసాగిస్తోంది. ప్రస్తుతం క్రీజులో హ్రిడాయ్ 09 పరుగులు, రహీమ్ 19 పరుగులతో ఆడుతున్నారు.

Show comments