Dharani
Kerala Woman Employee Abscond With Rs 20 Cr: పైన ఫొటోలో కనిపిస్తోన్న అక్క మాముల్ది కాదు. నమ్మి ఉద్యోగం ఇచ్చిన కంపెనీకే పంగనామాలు పెట్టింది. ఏకంగా 20 కోట్ల రూపాయలతో పరార్ అయ్యింది. ఆ వివరాలు..
Kerala Woman Employee Abscond With Rs 20 Cr: పైన ఫొటోలో కనిపిస్తోన్న అక్క మాముల్ది కాదు. నమ్మి ఉద్యోగం ఇచ్చిన కంపెనీకే పంగనామాలు పెట్టింది. ఏకంగా 20 కోట్ల రూపాయలతో పరార్ అయ్యింది. ఆ వివరాలు..
Dharani
సమాజంలో నమ్మించి మోసం చేసేవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఎదుటి వారి నమ్మకం చూరగొనే వరకు ఎంతో అమాయకంగా, మంచి వాళ్లుగా నటిస్తారు. ఆ తర్వాత సందు చిక్కితే చాలు దొరికినకాడికి చేతపట్టుకుని.. పరారవుతారు. అసలు ఎవరిని నమ్మాలో.. నమ్మకూడదో అర్థం కానీ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఉపాధి కల్పించి.. అన్నం పెట్టిన కంపెనీకే ఓ మహిళ భారీ పంగనామం పెట్టింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 కోట్ల రూపాయలతో జంప్ అయ్యింది. పోలీసులు సదరు మహిళ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ వివరాలు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళ, త్రిచూర్‌లోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ నుంచి రూ.20 కోట్లతో పరారయ్యింది మహిళా ఉద్యోగిని ఒకరు. కొల్లంలోని తిరుముళ్లవరం నెల్లిముక్‌కు చెందిన ధన్యమోహన్ ఈ భారీ స్కామ్‌కు పాల్పడింది. నిందితురాల వలపాడ్ ఆర్థిక సంస్థలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్. సుమారు 18 ఏళ్లుగా ఆమె అక్కడ పని చేస్తోంది. ప్రారంభంలో ఎంతో నమ్మకంగా ఉంటూ.. మంచిదానిగా గుర్తింపు తెచ్చుకుని.. ఆ తర్వాత నెమ్మదిగా.. ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి.. కంపెనీ డబ్బును వాటిల్లోకి పంపి.. ఆ తర్వాత ఆ మొత్తంతో పారరాయ్యింది. ఈ ఘటనపై వలపాడ్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
త్రిచూర్‌లోని వలపాడ్ సంస్థ చాలా మందికి రకరకాల లోన్లు ఇస్తోంది. ఆ తర్వాత వాటిపై వడ్డీతో కలిపి ఈఎంఐ రూపంలో వసూలు చేస్తుంది. సాధారణంగా ఆర్థిక సంస్థలు ఏవైనా ప్రతి ఏటా చివర్లో లావాదేవీలకు సంబంధించి.. అకౌంటింగ్ నిర్వహిస్తాయి. కానీ ఈ సంస్థ మాత్రం ఏటా అకౌంటింగ్ సరిగా నిర్వహించట్లేదు, ఆడిట్ కూడా సరిగా జరగట్లేదు. ఇది గమనించిన ధన్య మనసులో ఓ చేడు ఆలోచన వచ్చింది. నిత్యం లక్షల రూపాయలను చూడటంతో.. ఆమె కళ్లుకుట్టాయి. ఎలాగైనా డబ్బు కాజేయాలని భావించింది. ఇందుకు ఓ ప్లాన్ వేసుకుంది.
దీనిలో భాగంగా.. ఐదేళ్ల క్రితం నుంచి అనగా 2019 నుంచి ధన్య.. ఆన్‌లైన్‌లో పర్సనల్ లోన్ అకౌంట్లు క్రియేట్ చెయ్యడం ప్రారంభించింది. అవన్నీ నకిలీ అకౌంట్లే. తన తండ్రి, సోదరుడు, బంధువులు, స్నేహితులు.. ఇలా ఉన్నవాళ్లు, లేనివాళ్ల పేర్లపై.. రకరాకల అకౌంట్లను క్రియేట్ చేసి, డబ్బును వారి బ్యాంక్ అకౌంట్లకు పంపించడం ప్రారంభించింది. సంస్థ అకౌంట్లలో లోన్లు ఇచ్చినట్లు కనిపిస్తుంది కానీ అవి నిజమైన అకౌంట్లు కాదు.. ఆ లోన్లను రికవరీ చేయ్యలేం.. వాటిపై వడ్డీ కూడా రాదు. ఇలా ధన్య.. ఏటా కోట్ల రూపాయలను అక్రమంగా తరలిస్తోంది.
తాజాగా సంస్థలో నగదు తగ్గిపోతున్న విషయం తెర మీదకు వచ్చింది. కంపెనీలో ఏవో అవకతవకలు జరుగుతున్నాయి అని భావించిన యాజమాన్యం ఇన్నర్ ఆడిట్ ప్రారంభించారు. దాంతో తన గుట్టు రట్టవుతుందని ధన్యకు అర్థమైంది. ఆడిట్ జరుగుతున్నప్పుడు ఆఫీసులో ఉన్న ఆమె.. ఆరోగ్యం బాగాలేదని చెప్పి.. మెల్లగా ఆఫీసు నుంచి జారుకుంది. 18 ఏళ్ల నుంచి అక్కడే పని చేస్తోన్న ఉద్యోగిని కావడంతో.. యాజమాన్యం ఆమెను ఇంటికి వెళ్లడానికి అనుమతిచ్చింది. ఆ తర్వాత నుంచి ధన్య కనిపిస్తే ఒట్టు. ఆమె ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ అయ్యింది. కుటుంబ సభ్యులూ లేరు. అందరూ ఎటో చెక్కేశారు. సంస్థ నిర్వాహకులు మాత్రం రూ.20 కోట్లు పోగొట్టుకొని లబోదిబోమంటున్నారు. ధన్య కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.