గెలుపు పై కేసీఆర్, కవిత…

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు ఘనవిజయాన్ని అందించిన ప్రజలకు సీఎం కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఈ నెల 26న హుజూర్‌నగర్‌ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు సభను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గురువారం సాయంత్రం అయన ప్రగతి భవన్ లో విలేకర్ల తో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డి భారీ గెలుపుకు సహకరించిన పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు  
హుజూర్నగర్ ఉప ఎన్నిక ఫలితాలపై మాజీ ఎంపీ కవిత స్పందించారు. ‘కేసీఆర్‌పై అచంచలమైన విశ్వాసాన్ని ప్రదర్శించి, టీఆర్‌ఎస్‌కు అపురూపమైన విజయాన్ని అందించిన హుజూర్‌నగర్‌ ప్రజలకు ధన్యవాదాలు. ఈ విజయం కోసం నిరంతరం శ్రమించిన టీఆర్‌ఎస్‌ కుటుంబ సభ్యులందరికి శుభాకాంక్షలు’అంటూ కవిత ట్వీట్‌ చేశారు. 
Show comments