Prabhas : ఇంత రెమ్యునరేషన్ ఇంకో స్టార్ కు సాధ్యమా

బాహుబలికి నాలుగేళ్లు ఖర్చయితే అయ్యింది కానీ దానికి మించిన గొప్ప ఫలితాన్ని ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ ఆస్వాదిస్తున్నాడు. పాన్ ఇండియా తప్ప దాని స్థాయికి తక్కువ సినిమా తీసేదే లేదంటూ నిర్మాతలు పోటీ పడి మరీ బడ్జెట్ లు పెంచేస్తున్నారు. తాజాగా రెబెల్ స్టార్ రెమ్యునరేషన్ తన ఒక్కడికే 150 కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నారని ముంబై మీడియాలో వచ్చిన వార్త సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందబోయే స్పిరిట్ కోసం నిర్మాణ సంస్థలు ఈ మొత్తాన్ని ఆఫర్ చేశాయని వినికిడి. ఇది కాస్తా బయటికి రావడంతో రాధే శ్యామ్ అప్డేట్స్ రెగ్యులర్ గా లేక కాస్త డల్ గా ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు.

నిజానికి చెప్పాలంటే నూటా యాభై కోట్లు ఓ పెద్ద హీరోతో సినిమా తీసే బడ్జెట్ కన్నా చాలా ఎక్కువ. కొందరికి ఈ మొత్తం లైఫ్ టైం అఛీవ్మెంట్ కాలేకపోయింది. అలాంటిది కేవలం ఒక్కడికే ఇంత సొమ్ము ఇస్తున్నారంటే ప్రభాస్ ఇమేజ్ జాతీయ స్థాయిలో ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అమీర్ ఖాన్ ని సైతం దాటేశాడని కొన్ని పత్రికలు ఉటంకిస్తున్నాయి. ఒకప్పుడు 90ల ప్రాంతంలో చిరంజీవి పారితోషికం కోటి రూపాయలు దాటిందన్నపుడు అదో సెన్సేషన్. కొన్ని ఇంగ్లీష్ మ్యాగజైన్లు బిగ్గర్ థాన్ బచ్చన్ అనే హెడ్డింగులతో ప్రత్యేక కథనాలు వెలువరించాయి. అలా ఇప్పుడు పోల్చుకుంటే తెలుగు సినిమా రేంజ్ ఏంటో ఇప్పుడర్థమవుతుంది.

ప్రభాస్ రాధే శ్యామ్ 14న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. తనవరకు ఆది పురుష్ షూటింగ్ ని పూర్తి చేశాడు. సలార్ కూడా 2022 సమ్మర్ లోగా ఫినిష్ అవుతుంది. ఆపై నాగ అశ్విన్ రూపొందిస్తున్న ప్రాజెక్ట్ కె రెగ్యులర్ షూట్ ఉంటుంది. సందీప్ వంగా అనిమల్ తాలూకు పనులు అయ్యాక స్పిరిట్ ని స్టార్ట్ చేస్తాడు. ఈలోగా బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ తో చేయాల్సిన ప్రాజెక్ట్ అనౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇవి కాకుండా మరో మూడు నాలుగు చర్చల దశలో ఉన్నాయి. ఛత్రపతిలో రాజమౌళి ప్రభాస్ పాత్రని ఉద్దేశించి చెప్పినట్టు వాడి బాడీ బాక్సాఫీస్ అన్నమాట అక్షరాలా నిజమవుతోంది. ఇంతకన్నా సాక్ష్యం కావాలా

Also Read : RRR & Pushpa : పాన్ ఇండియా సినిమాలకు ఒకే ఇబ్బంది

Show comments