Irfan pathan fires on Pakistan over Jai sreeram aligations: PAKకి వెళ్లినప్పుడు నాపైన రాళ్లు వేశారు! ‘జై శ్రీరామ్’ అంటే తప్పేంటి? భారత మాజీ ప్లేయర్

PAKకి వెళ్లినప్పుడు నాపైన రాళ్లు వేశారు! ‘జై శ్రీరామ్’ అంటే తప్పేంటి? భారత మాజీ ప్లేయర్

వన్డే వరల్డ్ కప్ ఫీవర్ ప్రపంచమంతా కొనసాగుతోంది. ముఖ్యంగా టీమిండియా ఫ్యాన్స్ కు మాత్రం ఫుల్ కిక్ ఇచ్చేస్తోంది. ప్రపంచ కప్ లో భాగంగా టైటిల్ కొట్టడమే లక్ష్యంగా బరిలోకి దిగిన టీమిండియా ఆ దిశగా దూసుకెళ్తుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చుతూ హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. అయితే ఇటీవల నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన భారత్, పాక్ మ్యాచ్ లో ఓ వివాదం చోటుచేసుకుంది. మ్యాచ్ జరుగుతున్నప్పుడు ప్రేక్షకులు జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారని, పాక్ ఆటగాళ్లు ఒత్తిడికి గురయ్యేలా కేకలు, విజిల్స్ వేశారని పాక్ కోచ్ ఆరోపించాడు. అయితే దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ తాజాగా స్పందించాడు.

పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఓటమి నుంచి పాక్ తేరుకోలేకపోతోంది. అయితే మ్యాచ్ జరుగుతున్నప్పుడు జై శ్రీరామ్ నినాదాలు చేశారని పాక్ ఆరోపిస్తూ బీసీసీఐపై ఐసీసీకి ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఐసీసీ ఫ్యాన్స్ చేసిన దానికి కోడ్ ఆఫ్ కండక్ట్ వర్తించదని తేల్చి చెప్పింది. అయితే ఈ వ్యవహారంపై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ పాకిస్తాన్ పై ఫైర్ అయ్యారు. తాను పాక్ పర్యటనకు వెళ్లినప్పుడు తనపై రాళ్లు, ఐరన్ బోల్టులు విసిరారని తెలిపాడు.

అవి తన కళ్ల మధ్యలో తగిలాయని కొంచెముంటే చూపు పోయేదని తెలిపాడు. మరి అప్పుడు మీరు రాళ్లు విసిరితే లేని తప్పు ఇప్పుడు టీమిండియా ఫ్యాన్స్ జై శ్రీరామ్ అంటే తప్పొచ్చిందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వాస్తవానికి పాకిస్తాన్ ఓటమి నుంచి ఎదురయ్యే విమర్శలను తట్టుకోలేకనే ఇలాంటి ఛీప్ ట్రిక్స్ ప్లే చేస్తుందని ఇర్ఫాన్ పఠాన్ అన్నారు. ఫ్యాన్స్ చేసిన పనిని పట్టుకుని మేమేమీ ఫిర్యాదులని రచ్చ చేయలేదని ఇర్ఫాన్ పఠాన్ పాకిస్తాన్ కు చురకలంటించాడు.

Show comments