తెలంగాణాలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల

  • Published - 10:21 AM, Thu - 18 June 20
తెలంగాణాలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల

తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియట్‌ ఫలితాలు వెల్లడించింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రథమ,ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒక్కసారే విడుదల చేశారు.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 9.50 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు.కాగా ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో 2.88 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా ద్వితీయ సంవత్సర ఫలితాల్లో 2.83 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.

ప్రథమ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో బాలికల ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉండటం విశేషం..ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 60.10 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, 67.4 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించారు.52.30 శాతం మంది బాలురు ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో కూడా 75.15 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించగా, బాలురు 62.10 ఉత్తీర్ణత సదర్శించారు.

Show comments