మలయాళం లో బన్నీ దుమ్ము రేప బోతున్నాడు

మెగా హీరో  అల్లుఅర్జున్ డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో వస్తున్న నాపేరు సూర్య నాఇల్లు ఇండియా సినిమా మీద ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా ఈ సినిమా గురించి విడుదల చేసిన ఫస్ట్ ఇంపాక్ట్ మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. అంతేకాకుండా ఈ  నాపేరు సూర్య ఫస్ట్ ఇంపాక్ట్ సోషల్ మీడియాలో అనేక సంచలనాలు సృష్టించింది. తాజాగా విడుదల చేసిన సైనిక పాట కూడా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.

 

హీరో అల్లు అర్జున్ మలయాళంలో భారీ మార్కెట్ ఉండటంతో ఈ సినిమా మలయాళ వెర్షన్ టీజర్ ను ఫిబ్రవరి 7వ తేదీన రిలీజ్ చేయనున్నారు .ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల రోజున ఈ సినిమాకు సంబందించిన ఒక సాంగ్ విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో అల్లుఅర్జున్ కి  జోడీగా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తుంది. ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు ఏప్రిల్ 27న విడుదల చేయనున్నారు.  

Show comments