hero nagarjuna sister passed away: అక్కినేని ఇంట విషాదం.. నాగార్జున సోదరి కన్నుమూత

అక్కినేని ఇంట విషాదం.. నాగార్జున సోదరి కన్నుమూత

ఇటీవల సినీ పరిశ్రమకు చెందిన కుటుంబాల్లో విషాదాలు చోటుచేసుకుటున్నాయి. టాలీవుడ్ కు చెందిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తండ్రి కొద్ది రోజుల క్రితం కన్నుమూసిన విషయం తెలిసిందే. తాజాగా అక్కినేని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. టాలీవుడ్ మన్మథుడు నాగార్జున సోదరి నాగ సరోజ కన్నుమూశారు. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్కినేని నాగేశ్వర రావు ముగ్గురు కూతుర్లలో ఒకరైన నాగ సరోజ మంగళ వారం తుదిశ్వాస విడిచారు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

కాగా నాగేశ్వరరావుకు సత్యవతి, నాగ సుశీల, నాగ సరోజ ముగ్గురు కూతుర్లు.. వెంకట్, నాగార్జున ఇద్దరు కొడుకులు ఉన్న విషయం తెలిసిందే. కాగా నాగార్జున టాలీవుడ్ లో స్టార్ హీరోగా ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. మరో వైపు నాగ సుశీల కొడుకు సుశాంత్ సినిమాల్లో రాణిస్తున్నాడు. అయితే నాగార్జున సోదరి అనగానే ముందుగా నాగ సుశీల మాత్రమే గుర్తుకొస్తది. ఎందుకంటే సినిమా ఫంక్షన్లు గానీ, ఫ్యామిలీ ఫంక్షన్లలో ఎక్కువగా నాగ సుశీల కనిపిస్తారు. నాగ సరోజ అంతగా కనిపించిన దాఖలాలు లేవు. ఈ కారణం చేతనే ఆమె మృతి చెందిన విషయం కాస్త ఆలస్యంగా వెలుగుచూసింది.

Show comments