Krishna Kowshik
Krishna Kowshik
పెరుగుతున్న నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలతో బెంబేలెత్తుతున్న ప్రజలకు స్వాంతన కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరపై రూ. 200 తగ్గించింది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల ఉండగా.. ఈ తగ్గింపు చోటుచేసుకుంది. అలాగే ప్రధాన మంత్రి ఉజల్వ యోజన కింద లబ్దిపొందుతున్న వారికి మరో 200 రూపాయలను సబ్సిడీ ప్రకటించింది. దీంతో ఈ లబ్దిదారులకు రూ. 400 సబ్సిడీని పొందనున్నారు. అలాగే ఉజ్వల పథకం రెండో దశకు ఆమోదం లభించడంతో కొత్తగా 75 లక్షల ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్లు పంపిణీ చేయనుండి కేంద్రం. ఇటీవల గోవా ప్రభుత్వం కూడా రేషన్ కార్డు దారులకు గ్యాస్ సిలిండర్ పై రూ. 275 సబ్సిడీ అందిస్తామని వెల్లడించింది. ఇప్పుడు తాజాగా ఈ జాబితాలోకి చేరింది మరో రాష్ట్రం.
మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బీజెపీ నేతృత్వంలోని సర్కార్ శుభవార్త చెప్పింది. వంట గ్యాస్ సిలిండర్ ను రూ. 450కే అందించనున్నట్లు శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ ధర రూ. 900 ఉండగా.. రూ. 450 వినియోగదారులు చెల్లిస్తే సరిపోతుందని, మిగిలినది రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ప్రకటించింది. ఈ ఆదేశాలు సెప్టెంబర్ 1 నుండే అమల్లోకి వస్తాయని పేర్కొంది. కాగా, మరికొన్ని రోజుల్లో మధ్యప్రదేశ్ లో ఎన్నికలు జరగుతున్నాయి. ఈ తరుణంలో ఈ ప్రకటన చేసింది బీజెపీ ప్రభుత్వం. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన, ముఖ్యమంత్రి లడ్లీ బహ్నా యోజన కింద గ్యాస్ కలెక్షన్లు తీసుకున్న వారికి కూడా ఈ తగ్గింపు వర్తిస్తుందని పేర్కొంది.
ఈ రెండు పథకాల్లో ఒక్క దానికి అర్హులైన సరే.. వారికి గ్యాస్ సిలిండర్ రూ. 450కే లభిస్తుందని వెల్లడించింది. అయితే సదరు గ్యాస్ రీ ఫిల్లింగ్ సెంటర్ల వద్ద గానీ, డోర్ డెలివరీ ద్వారా గ్యాస్ సిలిండర్ తీసుకున్న వినియోగదారులు పూర్తిగా ధరను చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. మార్కెట్ లో ధరల హెచ్చు తగ్గులను బట్టి రూ. 450 మినహాయించి మిగితా సొమ్మును నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు తెలిపింది. ఎన్నికల సమయంలో ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.