Fighter Movie Review And Rating: హృతిక్‌ రోషన్‌ నటించిన ఫైటర్‌ మూవీ రివ్యూ

Fighter Review Telugu: హృతిక్‌ రోషన్‌ నటించిన ఫైటర్‌ మూవీ రివ్యూ

Fighter Movie Review & Rating In Telugu: సిద్ధార్థ్‌ ఆనంద్‌ సినిమాలకు ప్రత్యేక అభిమానులుంటారు. వార్‌, పఠాన్‌ సినిమాల తర్వాత ఆయన డైరెక్షన్‌లో వచ్చిన చిత్రం ఫైటర్‌. మరి ఈ సినిమా ఎలా ఉంది అంటే..

Fighter Movie Review & Rating In Telugu: సిద్ధార్థ్‌ ఆనంద్‌ సినిమాలకు ప్రత్యేక అభిమానులుంటారు. వార్‌, పఠాన్‌ సినిమాల తర్వాత ఆయన డైరెక్షన్‌లో వచ్చిన చిత్రం ఫైటర్‌. మరి ఈ సినిమా ఎలా ఉంది అంటే..

ఫైటర్‌

20240125, U/A
యాక్షన్, థ్రిల్లర్, ఏరియల్ కాంబాట్
  • నటినటులు:హృతిక్ రోషన్, దీపికా పదుకోన్, అనిల్ కపూర్, కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్, రిషబ్ సాహ్నీ, వినయ్‌ వర్మ
  • దర్శకత్వం:సిద్ధార్థ్‌ ఆనంద్‌
  • నిర్మాత:సిద్ధార్థ్‌ ఆనంద్‌, జ్యోతి దేశ్‌పాండే, రామన్ చిబ్, అజిత్ అంధారే, అంకు పాండే, కెవిన్ వాజ్, మమతా భాటియా
  • సంగీతం:సంచిత్‌ బల్హారా
  • సినిమాటోగ్రఫీ:సచ్చిత్‌ పౌలోస్‌

2.75

వార్‌, పఠాన్‌ వంటి యాక్షన్‌ సినిమాలు తెరకెక్కించి భారీ విజయం సాధించిన దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన మరో యాక్షన్‌ థ్రిల్లర్‌ ఫైటర్‌. హృతిక్‌ రోషన్‌, దీపికా పదుకోన్‌ ఈ సినిమాలో జంటగా నటించారు. పుల్వామా అటాక్‌, టెర్రరిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారా.. బాక్సాఫీస్‌ దగ్గర ఫైటర్‌ హిట్టా.. ఫట్టా అన్నది ఇప్పుడు చూద్దాం..

కథ:

ప్యాటీ అలియాస్ షంషేర్ పఠానియా (హృతిక్ రోషన్) ఎయిర్ ఫోర్స్ పైలట్. అతనితో పాటు మిన్ని అలియాస్ మినల్ రాథోర్ (దీపికా పదుకోన్), సర్తాజ్ గిల్, బషీర్ ఖాన్ పని చేస్తుంటారు. ఒక ఆపరేషన్‌ కోసం వీరందరిని ఒక టీమ్‌గా ఏర్పాటు చేస్తారు. వాళ్ల కమాండ్ ఆఫీసర్ రాకీ అలియాస్ రాకేష్ జై సింగ్ (అనిల్‌ కపూర్‌). పుల్వామాలో తీవ్రవాద దాడి తర్వాత ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌.. పాకిస్తాన్‌లోని టెర్రరిస్ట్ క్యాంపుపై సర్జికల్ స్ట్రైక్ చేస్తుంది. అయితే అనుకోకుండా ఓ సుఖోయ్‌ యుద్ధ విమానం పాక్‌ ఆర్మీకి చిక్కుతుంది. దానిలో ఇద్దరు పైలెట్లు ఉంటారు. వాళ్లను ప్రాణాలతో వెనక్కి తీసుకు రావడం కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏం చేసింది? మధ్యలో ప్యాటీని హైదరాబాద్ ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీకి ఎందుకు షిఫ్ట్ చేశారు? చివరకు అందులో ఉన్న ఇద్దరు పైలెట్లు.. ప్రాణాలతో ఇండియా వచ్చారా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:

సిద్ధార్థ్‌ ఆనంద్‌ గత సినిమాల నేపథ్యంలో ఫైటర్‌ మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. పుల్వామా ఎటాక్‌ నేపథ్యంలో తెరకెక్కడంతో అందరి దృష్టి ఈ సినిమా మీదనే ఉంది. దేశభక్తి సినిమాలు అంటే కచ్చితంగా ఆడతాయనే భ్రమ ఉంది. కానీ కంటెంట్‌ లేకపోతే వేస్ట్‌ అని ఇప్పటికే చాలా సార్లు ప్రూవ్‌ అయ్యింది. కానీ ఈ విషయంలో ఫైటర్‌ సక్సెస్‌ అయ్యింది. యాక్షన్‌ సీన్స్‌ మాత్రమే కాక సెంటిమెంట్‌ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.

విజువల్స్‌ సినిమాకు ప్లస్‌ పాయింట్‌గా నిలిచాయి. వీఎఫ్‌ఎక్స్‌ పనితీరు ఫైటర్‌కు హైలెట్‌గా నిలిచింది. హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఏరియల్ కాంబాట్ సీన్స్‌ బాగున్నాయి. మ్యూజిక్‌ మాత్రం సో సోగా ఉంది. ఇలాంటి సినిమాకు మంచి బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ పడితే.. ఆ ఫీల్‌ వేరే లెవల్‌. కానీ ఫైటర్‌ ఆ విషయంలో తేలిపోయింది.

నటీనటుల పని తీరు:

హృతిక్‌ రోషన్‌, దీపికా పదుకోన్‌లు వారి వారి పాత్రల్లో అద్భుతంగా నటించారు. అనిల్‌ కపూర్‌ అనుభవం చాలా సీన్స్‌లో కనిపించింది. ఈ తెలుగు వాడైనా వినయ్‌ వర్మ కూడా తనదైన ముద్ర వేశాడు. మిగతా వాళ్లంతా తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

టెక్నికల్‌ అంశాలు:

ఫైటర్‌ సినిమా కోసం సచ్చిత్‌ పౌలోస్‌ మంచి సినిమాటోగ్రఫి అందించాడు. ఎఫెక్టివ్ రీ రికార్డింగ్ ఉండింటే యాక్షన్ సీక్వెన్సుల్లో గూస్ బంప్స్ ఎక్కువ అయ్యేవి. సాంగ్స్ జస్ట్‌ పాస్‌. కెమెరా వర్క్ బాగుంది.

ప్లస్‌లు:

  • హృతిక్‌ రోషన్‌, అనిల్‌ కపూర్‌, దీపికా పదుకోన్‌
  • వీఎఫ్‌ఎక్స్‌
  • సినిమాటోగ్రఫి

మైనస్‌లు:

  • పూర్‌ బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌
  • సాగదీసినట్లుండే స్క్రీన్‌ ప్లే

చివరి మాట: ఫైటర్‌ కమర్షియల్ ప్యాకేజ్డ్ పేట్రియాటిక్ సినిమా

Show comments