Dharani
ఏపీ ప్రజలకు అధికారులు కీలక అలెర్ట్ జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కఠిన రూల్స్ అమల్లోకి రాబోతున్నాయని.. వాటిని ఎవరైనా అతిక్రమిస్తే.. అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. ఎందుకంటే..
ఏపీ ప్రజలకు అధికారులు కీలక అలెర్ట్ జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కఠిన రూల్స్ అమల్లోకి రాబోతున్నాయని.. వాటిని ఎవరైనా అతిక్రమిస్తే.. అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. ఎందుకంటే..
Dharani
అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో కఠిన నియమాలు అమల్లోకి రానున్నాయని.. అతిక్రమిస్తే జైలుకే అని హెచ్చరిస్తున్నారు. అసలు ఇంతకు ఏం జరిగింది.. ఎందుకు ఈ రూల్స్.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమల్లో ఉంటాయి.. అంతేకాక ఇవి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వస్తాయా.. లేక కొన్ని ప్రాంతాలకే పరిమితమా.. అన్న వివరాలు మీ కోసం. ఇక ఈ అలర్ట్ జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. మే 13, సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. అయితే పోలింగ్ నాడు, మరుసటి రోజు ఏపీలో పలు ప్రాంతాల్లో గొడవలు రాజుకున్న సంగతి తెలిసిందే. కర్రళ్లు, రాళ్లతో పాటు.. ఏకంగా పెట్రోల్ బాంబులు కూడా విసురుకున్నారు. ఈ క్రమంలో కౌంటిగ్ నాడు కూడా గొడవలయ్యే అవకాశం ఉందని భావిస్తోన్న ఈసీ.. కఠిన నియమాలు అమలు చేసేందుకు రెడీ అయ్యింది. ఆవివరాలు..
ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సాగనుండగా.. ఇప్పటికే ఆరు దశల్లో పూర్తయ్యింది. ఈవారంతో పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. జూన్ 4 దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి. అదే రోజున అనగా జూన్ 4, మంగళవారం నాడు ఏపీకి సంబంధించి అసెంబ్లీ, పార్లమెంటు ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయితే పోలింగ్ నాడే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయి. కౌంటింగ్ నాడు కూడా ఇదే పరిస్థితి ఎదురుకానుందని సమాచారం. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం.. ఏపీలో కఠిన నియమాలు అమల్లోకి తీసుకువచ్చింది. పోలింగ్ రోజున రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉండబోతోందని.. ప్రజలు గుంపులుగా తిరిగితే.. అదుపులోకి తీసుకుంటామని హెచ్చరించింది.
మరో 5 రోజుల్లో కౌంటింగ్ ఉండనుండగా.. ఇప్పటికే మూడు అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. రెండు అంచెల్లో రాష్ట్ర పోలీసులు ఉండనుండగా.. మూడో అంచె అనగా.. కౌంటింగ్ కేంద్రాల దగ్గరగా కేంద్ర బలగాల్ని మోహరించారు. ఓట్ల లెక్కింపు సమయంలో మొత్తం 20 కంపెనీల బలగాలు రాష్ట్రవ్యాప్తంగా బందోబస్తు నిర్వహిస్తాయి. ఒక్కో కంపెనీలో 100-150 మంది ఉంటారు. ఆ లెక్కన రాష్ట్రవ్యాప్తంగా.. 2000-3000 మంది దాకా కేంద్ర బలగాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా పోలింగ్ నాడు ఆ తర్వాత.. ఘర్షణలు ఎక్కువగా జరిగిన పల్నాడు, చంద్రగిరి, పత్రితో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో బలగాల్ని మోరించబోతున్నారు.
అంతేకాక గత వారం నుంచే ఏపీలోని అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానం వచ్చిన వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఇక ఏపీలో జూన్ 6 వరకు ర్యాలీలు, ఊరేగింపులపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా బాణాసంచాపై కూడా ఆంక్షలు విధించారు. కార్డెన్ సెర్చ్‌లో భాగంగా గడువు తీరిన వాహనాలు, సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు పోలీసులు. కేంద్ర బలగాల రంగ ప్రవేశంతో పరిస్థితి అదుపులో ఉందన్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా.. ప్రస్తుతం రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నెలకొని ఉందని.. ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ లేదని వివరించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యి… ఎన్నికల కోడ్ తొలగిపోయే వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని తెలిపారు.