Dinesh karthik answer viral on Rohit, kohli batting: రోహిత్‌ శర్మ-విరాట్‌ కోహ్లీ ఇద్దరిలో ఎవరు బెస్ట్‌? DK ఆన్సర్‌ వైరల్‌

రోహిత్‌ శర్మ-విరాట్‌ కోహ్లీ ఇద్దరిలో ఎవరు బెస్ట్‌? DK ఆన్సర్‌ వైరల్‌

సుదీర్ఘకాలం టీమిండియా జట్టులో రాణించిన దినేశ్ కార్తిక్ ప్రస్తుతం కామెంటేటర్ గా వన్డే వరల్డ్ కప్ లో అలరిస్తున్నాడు. కాగా ప్రపంచ కప్ దిగ్విజయంగా సాగిపోతోంది. జట్ల మధ్య లీగ్ మ్యాచ్ లు ఊహకందని రీతిలో ఉత్కంఠతకు తెరలేపుతున్నాయి. వన్డే వరల్డ్ కప్ లో సంచలన విజయాలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న దినేశ్ కార్తిక్ కు పరీక్షలాంటి ప్రశ్న ఎదురైంది. ఓ యాంకర్ టీమిండియా దిగ్గజ బ్యాటర్లైన రోహిత్ శర్మ, కింగ్ కోహ్లీ లలో ఎవరు బెస్ట్ అని దినేశ్ కార్తిక్ ను అడిగాడు. దీంతో ఒక్కసారిగి ఆలోచనలో పడ్డాడు. ఎందుకంటే వారిద్దరు కూడా దినేశ్ కార్తిక్ కు మంచి స్నేహితులు, అద్భుతమైన ఆటగాళ్లు.

ప్రస్తుతం జరుగుగున్న వన్డే వరల్డ్ కప్ లో రోహిత్, కోహ్లీ అధ్భుతమైన ఫామ్ లో ఉన్నారు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ అర్ధ సెంచరీలు, సెంచరీలు బాదేస్తున్నారు. మరి ఇంతటి మెరుగైన ప్లేయర్లలో ఎవరు బెస్ట్, ఎవరి బ్యాటింగ్ ఇష్టం అంటే చెప్పడం ఎవరికైనా కష్టమే కదా. ఇదే విధంగా దినేశ్ కార్తిక్ కూడా తనకు ఎదురైన ప్రశ్నకు కాస్త ఇబ్బంది పడ్డాడు. కానీ ఫైనల్ గా తాను నొవ్వక ఇంకొకరిని నొప్పించక అన్న రీతిలో తెలివైన సమాధానం చెప్పాడు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఎవరు బెస్టో చెప్పిన దినేశ్ కార్తిక్ పట్ల పాజిటివ్ కామెంట్లతో నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇంతకీ డీకే ఏం చెప్పారంటే?

హిట్ మ్యాన్, కింగ్ కోహ్లీలలో ఎవరు బెస్ట్, ఎవరి బ్యాటింగ్ అంటే ఇష్టమన్న ప్రశ్నకు దినేశ్ కార్తిక్ అదిరిపోయే సమాధానం ఇచ్చారు. టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ అయితే ఓపెనర్ రోహిత్ బ్యాటింగ్ చూడ్డానికి ఇంట్రెస్టు చూపిస్తానని డీకే తెలిపారు. ఛేజింగ్ లో అయితే రన్ మెషీన్, ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూస్తానని వెల్లడించాడు. దీంతో డీకే చేసిన ఈ కామెంట్స్ నెట్టింటా వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం భారత్, బంగ్లా మధ్య పూణే వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం 45 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసి ఆటను కొనసాగిస్తోంది.

Show comments