Chandrababu Delhi Tour – చంద్రబాబు కు మోడి దర్శనం దక్కనట్లే

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలవడమే కాకుండా కొన్ని వీడియోలను కొన్ని నివేదికలను అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సాక్ష్యాలను అలాగే అవినీతికి సంబంధించిన వ్యవహారాలను కేంద్ర ప్రభుత్వ పెద్దలకు అందించే అవకాశం ఉందనే ప్రచారం తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఎక్కువగా చేస్తోంది. అదేవిధంగా రాష్ట్రపతి పరిపాలన కోసం చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తున్నారని రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన తర్వాత ప్రధానమంత్రి వద్ద కూడా ఈ అంశాలను తీసుకెళ్లే అవకాశం ఉందని ప్రచారం మొదలైంది.

అయితే చంద్రబాబు నాయుడు రాష్ట్రపతిని కలవడం కలిశారు గాని రాష్ట్రపతి వద్ద ఆయన ఏం మాట్లాడారు ఏంటనే దానిపై స్పష్టత లేదు. చంద్రబాబు తో పాటుగా టీడీపీ కీలక నేతలు కొంతమంది రాష్ట్రపతి వద్దకు వెళ్లి రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలను, అదేవిధంగా దళితులపై దాడులు జరుగుతున్నాయని, అమరావతి విషయంలో కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులు చేశారని తెలుగుదేశం పార్టీ నాయకులు అదుపులోకి తీసుకున్నారని ఫిర్యాదులు చేశారు.

Also Read : Chandrababu Delhi Tour – ఏపీలో ఉన్మాది పాలన అంటున్న బాబుకి హస్తినలో తప్పని ఎదురుచూపులు

రాష్ట్రపతిని కలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఈ అంశానికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్రమోడీని అదేవిధంగా హోంమంత్రి అమిత్ షా ను కలుస్తామని చెప్పారు. అయితే హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ దొరికిన సరే ప్రధానమంత్రి నరేంద్రమోడీ అపాయింట్మెంట్ దొరక లేదని సమాచారం. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ప్రధానమంత్రి ని కలవడానికి చంద్రబాబు నాయుడు పలుమార్లు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా రెండున్నర ఏళ్ల తర్వాత ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి ని కలవడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది.

ప్రధానమంత్రిని నేడు కలవాలని చంద్రబాబు నాయుడు భావించి ఒక రాజ్యసభ ఎంపీ ద్వారా అపాయింట్మెంట్లు తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే ప్రధానమంత్రి అనూహ్యంగా వారణాసి పర్యటనకు వెళ్లడం తో చంద్రబాబు నాయుడు రాష్ట్రపతిని కలిసిన తర్వాత ఢిల్లీలోనే ఉండిపోయే పరిస్థితి వచ్చింది. ఇక రేపు మోడీ అపాయింట్మెంట్ కోసం చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేసిన గాంధీనగర్ పర్యటన నేపథ్యంలో మోడీ కలవడం లేదని అంటున్నారు. ఇక ప్రధానమంత్రి నరేంద్రమోడీ కలవకపోతే చంద్రబాబు నాయుడు అమిత్ షా వద్ద కొన్ని నివేదికలు అప్పగించి తిరిగి వచ్చే అవకాశం ఉందని ప్రచారం మొదలైంది.

Also Read : Pattabhi Ram Fled Abroad – అజ్ఞాతంలో ఉన్నానని చెప్పుకున్న పట్టాభి హఠాత్తుగా అక్కడికి పారిపోవడం వెనుక కారణాలేంటి..?

అయితే కేంద్ర మంత్రులు ఏ ఒక్కరి అపాయింట్మెంట్ కూడా చంద్రబాబుకు దొరకలేదని సమాచారం. దీంతో రేపు ఎల్లుండి కూడా చంద్రబాబు ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉందని ఢిల్లీలో రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ నివాసంలో చంద్రబాబు నాయుడు మరో రెండు రోజుల పాటు ఉండి కొంత మంది ద్వారా కేంద్ర ప్రభుత్వ పెద్దల అపాయింట్మెంట్లు కోసం ప్రయత్నాలు చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ దొరకడాన్ని పెద్ద విజయంగా భావిస్తూ టీడీపీ నేతలు కొన్ని కామెంట్లు కూడా చేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం పై కేంద్రం ఏ చర్యలు తీసుకోవాలన్న లేకపోతే చేసిన ఫిర్యాదులు హోం శాఖ పరిధిలోకి వెళ్లాలన్నా కచ్చితంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలను చంద్రబాబు కలవాల్సి ఉంటుంది. మరి చంద్రబాబు కలుస్తారా లేదా అనేది చూడాలి.

Show comments