చంద్రబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అమరావతి పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఈ రోజు నుంచి బస్సు యాత్ర చేపట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇందులో భాగంగా బస్సు యాత్ర కోసం బయలుదేరుతుండగా అనుమతి లేదని పోలీసులు తెలిపారు. దీంతో చంద్రబాబు రోడ్డుపైనే బైఠాయించారు.

బస్సులకు ఆర్‌టీవో, పోలీసుల నుంచి అనుమతులు ఇంకా తీసుకోలేదని, బస్సు యాత్రకు పోలీసు శాఖ నుంచి అనుమతి వచ్చిన తర్వాత చేపట్టాలన పోలీసులు సూచించారు. అయినా చంద్రబాబు ఈ రోజు నుంచే యాత్ర చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసులు రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు, టీడీపీ నేతలు నారా లోకేష్, బొండా ఉమామహేశ్వరరావు తదితర టీడీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు.

కాగా, గత 22 రోజులుగా రాజధానిగా అమరావతి ఒక్కదాన్నే ఉంచాలంటూ టీడీపీ నేతలు, అమరావతి గ్రామాల్లోని కొంత మంది రైతులతో కలసి నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు చేశారు. తాజాగా ఐదు బస్సుల్లో రాష్ట్రంలో పర్యటించాలని నిర్ణయించారు.

Show comments