Idream media
Idream media
తన వీడియోలు అప్ లోడ్ చేయడం ద్వారా యూట్యూబ్ నుంచి తనకు ప్రతినెలా నాలుగు లక్షల రూపాయలు రాయల్టీగా వస్తున్నట్లు ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్న విషయం తెలిసిందే. ఇంతే కాదు.. మోదీ టీమ్ మినిస్టర్ లలో స్టార్ట్ ఇన్వెస్టర్స్ కూడా ఉన్నారు. షేర్లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకుంటున్నారు. పలు స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టిన కేంద్ర కేబినేట్ మంత్రులకు భారీగా లాభాలు వచ్చాయి. స్మార్ట్ ఇన్వెస్టింగ్ మినిస్టర్స్ వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ప్రతికూల కాలంలో సైతం లాభాల బాటలో భారత స్టాక్ మార్కెట్లు ఉండటంతో అందులో పెట్టుబడులు పెట్టిన కేంద్ర మంత్రులు కూడా లాభాలు మూటగట్టుకున్నారు. తాజాగా ప్రధానమంత్రి కార్యాలయానికి సమర్పించిన డిక్లరేషన్లలో మంత్రుల పేర్లు వెల్లడయ్యాయి. అయితే.. ప్రధాని మోదీ రూటు మాత్రం సెపరేట్ గా ఉంది.
“షేర్” షా..
ప్రధానమంత్రి కార్యాలయానికి సమర్పించిన డిక్లరేషన్ ప్రకారం.. కేంద్ర మంత్రుల్లో అత్యధిక ధనవంతుడుగా అమిత్ షా ఉన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నికర ఆస్తుల విలువ 32 శాతం పెరిగి రూ.37,91,50,580 (రూ.38 కోట్లు)గా ఉంది. షా ఆస్తి విలువ పెరుగుదలలో అత్యధిక వాటా షేర్లదే. డభ్బై నాలుగు శాతం పెరిగిన షా చేతిలో ఉన్న పలు కంపెనీల షేర్ల ధరలు. తన మొత్తం షేర్ల విలువ రూ.24.5 కోట్లని తాజాగా షా వెల్లడించారు. అదే 2019-20 సంవత్సరంలో మొత్తం షేర్ల విలువ రూ.13.5 కోట్లు మాత్రమే. ప్రస్తుతం షా వద్ద ఉన్న షేర్లలో వారసత్వంగా సంక్రమించిన రూ.19.7 కోట్ల విలువైన షేర్లుగా తెలుస్తోంది. అమిత్ షా సొంతంగా కొన్న షేర్ల విలువ రూ.3.78 కోట్లు. 2019 లోక్ సభ ఎన్నికల సందర్భంగా షా ఈసీకి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఉన్న 190 కి పైగా లిస్టెడ్ కంపెనీల షేర్లు. షా వద్ద ఉన్న టాప్ కంపెనీల షేర్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, టాటా కన్సట్టెన్సీ సర్వీసెస్, అల్ట్రాటెక్ సిమెంట్, హిందుస్థాన్ యూనీలీవర్, మారుతి సుజుకి, ఐటీసీ ఉన్నాయి.
Also Read : కాంగ్రెస్, బీజేపీల నేతలు టీఎంసీలోకి ఎందుకు వెళుతున్నారు..?
టాప్ 2 పీయూష్ గోయల్..
వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా ధనిక మంత్రుల్లో ఒకరుగా నిలిచారు. 2020-21లో గోయల్ నికర ఆస్తి విలువ గత ఏడాదితో పోలిస్తే 10శాతం(రూ.2.8 కోట్లు) పెరుగుదల కనిపిస్తోంది. రూ.30.26 కోట్లకు చేరిన గోయల్ నికర ఆస్తి విలువ. వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ షేర్ల విలువలో 96 శాతం పెరిగాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో షేర్ల విలువ రూ.2.72 కోట్ల. 2020-21 ఆర్థిక సంవత్సరంలో షేర్ల విలువ రూ.5.33 కోట్లుగా ఉంది.
ఇక మిగిలిన మంత్రుల్లో…
పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ పురి ఆస్తి విలువ మాత్రం తగ్గింది. ఫ్లాంక్లిన్ క్రెడిట్ రిస్క్ ఫండ్ లో తన పెట్టుబడుల విలువ రూ.18.6 లక్షలని తాజాగా డిక్లరేషన్లో హర్దీష్ పురి వెల్లడించారు. అలాగే.. ఈ ఏడాది కేబినెట్ విస్తరణలో రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆశ్వనీ వైష్ణవ్ చేతిలో మూడు లిస్టెడ్ కంపెనీల షేర్లు ఉన్నాయి. ఇవి గుజరాత్ ఫెర్టి లైజర్స్ అండ్ కెమికల్స్, ఎల్ అండ్ టీ, వేదాంత కంపెనీలకు చెందిన షేర్ల విలువ రూ.6.23 లక్షలు. ఇక పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ మెంట్స్ రూ.11 లక్షలు కాగా.. సింధియా మొత్తం ఆస్తి విలువ రూ.35.4 కోట్లు. సింధియా మొత్తం ఆస్తి విలువలో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల వాటా స్వల్పంగానే కనిపిస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆస్తి విలువల్లో కూడా పెరుగుదల స్వల్పంగానే ఉంది.\
Also Read : వైఎస్సార్ ముఖ్యమంత్రి ఎలా అయ్యారు..? కేంద్ర మాజీ మంత్రి వ్యాఖ్యల్లో నిజమెంత..?
మోదీ రూటే.. సెపరేటు..
ఆ డిక్లరేషన్ ప్రకారం.. ప్రధాని నరేంద్ర మోదీ రూటు మాత్రం సెపరేటుగా ఉంది. మోదీ ఎలాంటి వ్యాపార, ఆర్థిక కార్యకలాపాలు చేపట్టడం లేదు. ఆయన ఆస్తుల్లో పెరుగుదల కేవలం బ్యాంకులోని ఫిక్సిడ్ డిపాజిట్ల వల్ల పెరిగింది మాత్రమే. ఇక, ఈ ఏడాది ఆస్తులకు సంబంధించి ప్రధాని మోదీ తాజా డిక్లరేషన్ ఇలా ఉంది. మోదీ నికర ఆస్తి విలువ 2020-21 నాటికి రూ.3.07 కోట్లు కాగా, 2019-20 లో మోడీ నికర ఆస్తి విలువ రూ.2.85 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. 2019-20 తో పోలిస్తే ఏడు శాతం అంటే ఇరవై రెండు లక్షలు మాత్రమే మోదీ ఆస్తి విలువ పెరిగింది. ఈ పెరుగుదల కూడా బ్యాంకుల్లో ఉన్న ఫిక్స్ డ్ డిపాజిట్ల వల్లే వచ్చినట్లు డిక్టరేషన్ లో పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్లలో ప్రధాని పెట్టుబడులు పెట్టకపోవడం గమనార్హం.