Central govt good news to Farmers: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. రైతులకు పండగ లాంటి వార్త

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. రైతులకు పండగ లాంటి వార్త

ఆరుగాలం శ్రమించి అప్పులపాలవుతున్న రైతన్నలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయి. వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వాలు పలు పథకాలను ప్రవేశపెడుతున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం ద్వారా ఏడాదికి రూ. 6 వేల చొప్పున అందిస్తోంది. విడతకు రూ. 2 వేల చొప్పున మూడు విడతల్లో నేరుగా రైతుల అకౌంట్లల్లో జమ చేస్తుంది కేంద్రం. ఈ క్రమంలో రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధర దక్కాలని ప్రభుత్వం మద్దతు ధరను ప్రకటిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్ర ప్రభుత్వం పంటలకు మద్దతు ధర ప్రకటించింది.

పండగ వేళ కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు శుభవార్తను అందించింది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర పంటలకు కనీస మద్దతు ధరను పెంచింది. పెంచిన మద్దతు ధరకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రబీ సీజన్‌కు సంబంధించి గోధుమ, బార్లీ సహా మొత్తం 6 ప్రముఖ పంటల కనీస మద్దతు ధర పెంచింది. 2024- 25 రిబీ సీజన్‌కు గానూ గోధుమ, బార్లీ, సన్‌ఫ్లవర్, శనగ, ఆవాలు, కంది పంటలకు కనీస మద్ధతు ధర పెంచుతూ కేబినెట్ ఆమోదం తెలిపింది.ఇందులో అత్యధికంగా గోధుమ పంటలకు క్వింటాలుకు రూ. 150 పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

తాజా నిర్ణయం ప్రకారం గోధుమల కనీస మద్దతు ధరను రూ. 150 పెంచడంతో క్వింటా గోధుమల ధర రూ. 2, 275కు చేరింది. బార్లీ పంటపై రూ. 115 పెంపుతో క్వింటాకు రూ. 1850కి పెరిగింది. శెనగ పంటపై రూ. 105 పెంపుతో క్వింటాలు శెనగ ధర రూ. 5,440కి పెరిగింది. కంది పంటపై రూ. 425 పెంచడంతో క్వింటాలుకు ధర రూ. 6,425కు పెరిగింది. ఆవాలుపై రూ. 200 పెంపుతో క్వింటాలు ధర రూ. 5, 650కి పెరిగింది. సన్‌ఫ్లవర్ పంటపై రూ. 150 పెంచడంతో క్వింటాలు ధర రూ. 5,800కు పెరిగింది. పంటలకు కనీస మద్దతు ధర పెంచడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Show comments