TDP CBN dicipline -టీడీపీలో కొత్త పంథా : బాబు మార్క్ రాజ‌కీయాలు ప‌ని చేయ‌డం లేదా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడి చాణిక్య‌త గురించి ఎంత చెప్పినా త‌క్కువే. రాజ‌కీయాల్లో మ‌హా ప్ర‌భంజ‌నం సృష్టించిన ఎన్టీఆర్ నుంచి పార్టీని త‌న వైపు తిప్పుకున్నారంటేనే ఆయ‌న ఏ రేంజ్ లో మంత్రాంగం న‌డిపారో అర్థం చేసుకోవ‌చ్చు. ఒక విధంగా టీడీపీ వ్యవస్థీకృతమైంది అంటే అది ఆయ‌న చ‌క్రం తిప్ప‌డ‌మే అని అంద‌రూ భావిస్తారు. తెలుగుదేశం పార్టీలో పాతికేళ్లుగా త‌న మాట‌కు ఎదురులేకుండా ఆయ‌న చేసుకుంటూ వ‌చ్చారు. కానీ.. తాజా ప‌రిస్థితులు అందుకు విరుద్ధంగా క‌నిపిస్తున్నాయి.

తెలుగుదేశం పార్టీలో కొన్ని నియోజకవర్గాల ఇంచార్జిలను బాబు తాజాగా మార్చారు. తనదైన శైలిలో పాతవారి పనితీరుని అంచనా వేసిన బాబు కొత్త వారికి అవకాశాలు ఆయా చోట్ల ఇచ్చారు. ఒక విధంగా చెప్పాలి అంటే బాబు సాహసించారనే అనుకోవాలి. అలా ఉత్తరాంధ్రా జిల్లాలలో కూడా కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. విజయనగరం జిల్లా సాలూరులో గుమ్మడి సంధ్యారాణీని టీడీపీ ఇంచార్జిని చేశారు. అదే టైమ్ లో మాజీ ఎమ్మెల్యే భంజ్ దేవ్ ని పక్కన పెట్టారు. దాంతో ఆయన వర్గీయులు గుర్రు మీద ఉన్నారు. అసలే సాలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే రాజన్నదొరకు కీలకమైన స్థావరం. బలమైన నియోజకవర్గం. అలాంటి చోట కలసి పోరాడాల్సిన తమ్ముళ్ళు ఇంచార్జి దగ్గరే వివాదాలు పడితే ఎలా అన్నది ఒక ప్రశ్నగా ఉంది. అయినా సరే భంజ్ దేవ్ సంధ్యారాణి నాయకత్వాన పార్టీ మీటింగులకు హారవుతున్నారు. ముందు ముందు ఈ కధ ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి.

Also Read : Power Crisis విద్యుత్ సంక్షోభం, విపక్ష టీడీపీ నేతలకు వచ్చిన ఇబ్బందేంటీ

ఇంకో వైపు చూస్తే విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలో కూడా బాబు మార్పు చేశారు. బలమైన నేతగా పేరున్న మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడుని పక్కన పెట్టి కొత్తగా పార్టీలోకి వచ్చిన పీవీజీ కుమార్ కి చాన్స్ ఇచ్చారు. దాంతో రామానాయుడు వర్గం రగిలిపోతోంది. తమ నాయకుడు దశాబ్ద కాలం పైగా పార్టీ కోసం కష్టపడుతూ వచ్చారని ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధి కూడా చేశారని అలాంటి నేతను పక్కన పెడతారా అని తమ్ముళ్ళు ఏకంగా టీడీపీ అధినాయకత్వం మీదనే కారాలూ మిరియాలూ నూరుతున్నారు. తాజాగా మాడుగులలోని నాలుగు మండలాలకు చెందిన పార్టీ నాయకులు అంతా సమావేశమై మళ్లీ గవిరెడ్డికే ఇంచార్జి బాధ్యతలు అప్పగించాలని తీర్మానం చేశారు. ఒక విధంగా ఇది తెలుగుదేశం పార్టీ విధానాలకే విరుద్ధం. కానీ.. ఈ త‌ర‌హా తీర్మానాలు చాలా చోట్ల జ‌రుగుతున్నాయి.

పార్టీ అధినేతగా చంద్రబాబు ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఎవరైనా తలొగ్గాల్సిందే. అలాంటిది ఇపుడు ఇన్ చార్జి నియామ‌కాల్లో పార్టీ లైన్ దాటి తమ్ముళ్ళు మాట్లాడడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కొంత మంది బాహాటంగానే బాబు నిర్ణ‌యాల‌ను త‌ప్పుబ‌డుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు సీనియ‌ర్ నేత‌లే అనుకుంటే.. కొత్త‌గా త‌మ్ముళ్లు కూడా నిర‌స‌న స్వ‌రం వినిపిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ బాబు క‌న్నెర్ర చేయ‌లేక‌పోతున్నార‌ని, క్ర‌మ శిక్ష‌ణా చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి ఆలోచిస్తున్నార‌ని పార్టీ వ‌ర్గాల్లో టాక్ న‌డుస్తోంది. పార్టీ ప‌రిస్థితి బాగోలేక‌పోవ‌డమే ఇందుకు కార‌ణాల‌నే వాద‌న వినిపిస్తోంది.

Also Read : మలుపులు తిరిగిన Jammalamadugu రాజకీయం : టీడీపీలోకి ఆదినారాయణరెడ్డి అన్న కుటుంబం

Show comments