Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు మంచి కాక మీద ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రజా సంక్షేమం, సంరక్షణపైనే ఎక్కువగా దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా కూడా దూకుడు పెంచారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. దీంతో ఆందోళనలు, అలజడులు సృష్టిస్తున్న టీడీపీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు కట్టడి చేస్తున్నారు. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దాడిపై కేంద్ర మంత్రి అమిత్ షా కు ఫోన్ చేసిన చంద్రబాబు నేడు ఢిల్లీలో ఆయనతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త తరహా ప్రచారం తెరపైకి వస్తోంది.
రాష్ట్రంలో టీడీపీ చేస్తున్న ఆందోళనల వెనుక రాజకీయ ప్రయోజనాలే అని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా పార్టీ నేతలు మాట్లాడుతున్నా, కట్టడి చేయాల్సిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పరిస్థితి చేయి దాటే వరకు నిమ్మకుండా ఉండడం అనుమానాలకు తావిస్తోంది. సాధారణ రాజకీయాల ద్వారా జగన్ ను ఎదుర్కోవడం కష్టమైన పని. ఆ విషయం టీడీపీ నేతలకు అర్థమైపోయింది. ప్రభుత్వ పథకాలపై వ్యతిరేకంగా ఏం మాట్లాడినా జనం హర్షించడం లేదు. ఎక్కడా అవినీతి దొరకడం లేదు. జగన్ ఇచ్చిన ఏ మాటనూ వెనక్కి తీసుకోవడం లేదు. దీంతో ప్రజలను ఆకట్టుకునేలా కార్యక్రమాల రూపకల్పనకు ప్రతిపక్షానికి ఏ అంశం దొరకడం లేకనే ఇటువంటి రాజకీయాలకు పాల్పడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
టీడీపీ ఇటీవల చేపట్టిన బంద్ లు, దీక్షలు ప్రజల కోసం కాదు. కేవలం పార్టీ ప్రయోజనాల కోసమే. దీంతో వారికి ప్రజల మద్దతు లభించలేదు. దీంతో జగన్ ను ఎదుర్కోవడానికి కేంద్రం వద్ద కొత్త ప్రతిపాదన చేస్తున్నట్లుగా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తన స్వలాభం కోసమే గతంలో చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీని మోసం చేశారని, ఇప్పుడు కూడా స్వప్రయోజనాల కోసం ఆయనతో కలిసి కొత్త ప్రతిపాదనలను ముందుకు తెస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపిస్తున్నారు. ఏపీలో వైసీపీని గద్దె దించేందుకు సహకరిస్తే.. తెలుగుదేశాన్ని బీజేపీలో కలుపుతామంటూ చంద్రబాబు ప్రతిపాదనలు పంపారని విజయసాయి రెడ్డి అనుమానం వ్యక్తం చేస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Also Read : Sajjala Request – బోసిడీకే అంటే బాగున్నారా..? అని అర్థమా..? ఢిల్లీ నేతలను ఇదే పదంతో సంబోధించండి బాబు