Idream media
Idream media
సరికొత్త రాజకీయాలకు చిరునామాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలుస్తున్నారు. పాలనలో కూడా ప్రత్యేకతను చాటుతున్నారు. పౌర సేవల్లో లంచాలకు తావు లేకుండా చేసిన జగన్.. ఓట్లను డబ్బుతో కొనుగోలు చేసే సంస్కృతికి కూడా చరమగీతం పాడుతున్నారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో జగన్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ఓటు కోసం, గెలవడం కోసం పార్టీ నాయకులు కానీ, అభ్యర్థి కానీ రూపాయి ఖర్చు చేయకూడదని ఆదేశాలు జారీ చేశారు. కేవలం తమ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించి, జరుగుతున్న, జరగబోయే అభివృద్ధిని తెలియజేస్తూ ఓట్లను అభ్యర్థించాలని చెప్పారు. ఓట్లను కొనకపోయినా వైసీపీ అభ్యర్థి బంపర్ మెజార్టీతో గెలిచారు. బద్వేలు ఉప ఎన్నికలో కూడా జగన్ ఇప్పుడు అదే చేయబోతున్నారు.
కడప జిల్లా బద్వేలు ఉపఎన్నిక ఇప్పటికే చర్చనీయాంశంగా మారింది. టీడీపీ పోటీ నుంచి తప్పుకోవడం, పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన జనసేన.. మిత్రపక్షం బీజేపీకి మాత్రం మద్దతు ఉందని ప్రకటించడం.. ఇలా ప్రతీదీ ఆసక్తికరంగానే మారింది. ఏకగ్రీవం అవుతుందని మెజార్టీ వర్గాలు భావించినప్పటికీ, బీజేపీ వెనక్కి తగ్గకపోవడం తో పోటీ అనివార్యమైంది. ఈ నెల 30 న ఓటింగ్ జరగబోతుంది. దీనితో వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు పలువురు కీలక నేతలు పార్టీకి అఖండ విజయాన్ని అందించడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇలాంటి సమయంలో సీఎం జగన్ చేసిన ఓ ప్రకటన సంచలనంగా మారింది.
Also Read : Huzurabad By Poll -హుజూరాబాద్ : ఫస్ట్ ప్లేస్ లో బీజేపీ.. లాస్ట్ లో టీఆర్ఎస్..!
ఓట్లు అంటే డబ్బు కట్టలు ,మద్యం ఏరులై పారుతుంది. ముఖ్యంగా ప్రాణం పోయినా కొన్ని గెలవాల్సిన సీట్లు కొన్ని ఉంటాయి. అక్కడ ఓటు కి ఎంతైనా ఇవ్వడానికి అధికార విపక్షాలు వెనుకాడవు. కడప జిల్లాలో వైసీపీ హవా ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. దీనితో ఇప్పుడు బద్వేల్ ఉప ఎన్నికల్లో డబ్బు పంచుతారా లేదా అనేదానిపై చర్చలు విపరీతంగా జరుగుతున్నాయి. ప్రధానంగా ఓటర్లకు డబ్బు పంపిణీ అధికార పార్టీ చర్యలపై ఆధారపడి ఉంటుంది. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో ఓటర్లకు డబ్బు పంపిణీ చేయకపోవడం పెద్ద చర్చకు దారి తీసింది. అధికారంలో ఉంటూ ఆర్థిక అంగబలాలు పుష్కలంగా ఉన్నప్పటికీ వైసీపీ మాత్రం వాటి జోలికి వెళ్లకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఈ నేపథ్యంలో బద్వేలు ఉప ఎన్నికలో అధికార పార్టీ వైఖరి ఏంటనే చర్చ జరుగుతోంది. బద్వేలు ఉప ఎన్నికలో కూడా ఓటర్లకు డబ్బు పంపిణీ చేయకూడదని పార్టీ నేతలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం ఇప్పుడు ఆసక్తిగా మారింది.
2019లో బద్వేలులో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ వెంకటసుబ్బయ్య.. ఈ ఏడాది మార్చిలో అనారోగ్యంతో మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా బద్వేలు ఉపఎన్నిక అందరి దృష్టిని ఆకర్షించనుంది. బద్వేల్ ఎన్నిక పై సీఎం జగన్ గత నెల చివర్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే అధికంగా ఉండాలన్నారు. గత ఎన్నికల్లో 44వేలకు పైగా మెజారిటీ వచ్చింది సీఎం జగన్ నేతలకు గుర్తుచేశారు. ఎక్కడా అతివిశ్వాసానికి తావు ఇవ్వకూడదని.. ప్రతి ఒక్కరితో మాట్లాడి పార్టీకి ఓటు వేసేలా చూడాలని శ్రేణులకు పిలుపు ఇచ్చారు. ఓటింగ్ శాతం కూడా అధికంగా నమోదయ్యేలా చూడాల్సిన బాధ్యత పార్టీ నేతలదేనని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలే భారీ మెజార్టీతో గెలిపిస్తాయని ఆయన గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈ క్రమంలో ఎన్నికల్లో డబ్బు పంపిణీ చేయకూడదని నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా అభినందనలు వస్తున్నాయి.
Also Read : Badvel By Poll-బద్వేల్ లో బీజేపీ కి ఎందుకు టెన్షన్ పట్టుకుంది?