భారత్ ఆస్ట్రేలియా తొలి డే అండ్ నైట్ వన్డే

ఈ మధ్యాహ్నం ముంబయి వాంఖడే స్టేడియం వేదికగా జరగనున్న తొలి డే అండ్ నైట్ వన్డేలో ఆస్ట్రేలియాతో భారత్ జట్టు ఢీకొట్టబోతోంది.గత ఏడాది మార్చిలో సొంతగడ్డపై జరిగిన ఐదు వన్డే మ్యాచ్ల సిరీస్ లో 3-2 తేడాతో ఆస్ట్రేలియా చేతిలో పొందిన పరాజయానికి బదులుగా మూడు వన్డేల సిరీస్ ను గెలిచి లెక్క సరిచేయాలని భారత జట్టు భావిస్తుంది.

శ్రీలంకతో జరిగిన గత టీ20 సిరీస్ లో విశ్రాంతి తీసుకున్న ఓపెనర్ రోహిత్ శర్మ,ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ తిరిగి జట్టులో చేరారు.ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ గాయంతో తుది జట్టులో స్థానం పొందిన నవదీప్ షైనీ ముగిసిన టి20 సిరీస్ లో నిలకడగా 145 కిలోమీటర్ల వేగముతో యార్కర్ బంతులు విసిరి రాణించడంతో ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల్లోనూ ఆడే అవకాశం కనిపిస్తుంది.

ఓపెనింగ్ జోడిగా రోహిత్,రాహుల్:
గత ఏడాది బ్యాటింగ్ లో చెప్పుకోతగ్గ స్థాయిలో రాణించని ఓపెనర్ శిఖర్ ధావన్ లంకతో జరిగిన రెండో టీ20 లో 32 పరుగులు,ఆఖరి టీ20లో అర్థ సెంచరీ సాధించి ఫామ్ లోకి వచ్చాడు.మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ గత మూడు సిరీస్‌ల నుండి నిలకడగా రాణిస్తున్నాడు. రాణిస్తున్న కే.ఎల్.రాహుల్‌,రోహిత్ శర్మతో కలిసి బ్యాటింగ్ ను ప్రారంభించే అవకాశం మెండుగా కనిపిస్తుంది.అయితే కుడి,ఎడమ చేతి బ్యాటింగ్ కలయిక గురించి జట్టు యాజమాన్యం ఆలోచించినప్పుడు మాత్రమే శిఖర్ ధావన్ కు ఛాన్స్ దొరుకుతుంది

మిడిల్ ఆర్డర్ బాధ్యత పంత్, శ్రేయస్ అయ్యర్ దే:
మూడో స్థానంలో కెప్టెన్ కోహ్లీ బ్యాటింగ్ చేయనుండగా, గత కొన్ని మ్యాచులు నుంచి నాలుగో స్థానంలో రాణిస్తున్న శ్రేయస్ అయ్యర్, ఐదో స్థానంలో రిషబ్ పంత్ చేసే అవకాశం ఉంది. బ్యాటింగ్ లో ఆరో స్థానం కోసం శివం దూబె,మనీష్ పాండే,కేదార్ జాదవ్ ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొని ఉంది.అయితే జాదవ్, పాండే జట్టు అవసరాలకు తగ్గట్టు రాణించక పోవడంతో బౌలింగ్ సామర్థ్యంగల ఆల్ రౌండర్ శివం దూబేకు ఛాన్స్ దొరకవచ్చు.

బుమ్రా,షమీ పునరాగమనం….సైని రాణింపుతో జోరుమీద ఉన్న ఫాస్ట్ బౌలర్లు

జస్‌ప్రీత్ బుమ్రాతో పునరాగమనం తరువాత రెండో మ్యాచ్లోనే మునుపటి స్థాయిలో బౌలింగ్ రిథం పొందడం,టెస్టుల్లో గత ఏడాది అద్భుత ప్రదర్శన కనబర్చిన మహ్మద్ షమీ లతోపాటు శ్రీలంక సిరీస్లో అద్భుత ప్రతిభ కనపరిచిన నవదీప్ సైని తో కూడిన పేస్ బౌలింగ్ దళం బలంగా కనిపిస్తుంది.

స్పిన్ విభాగంలో మణికట్టు స్పిన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ తుది జట్టులో స్థానం దాదాపు ఖరారు కాగా,మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్లకు అనుభవలేమి ఉండటంతో వేగంగా బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్న స్పిన్నర్ రవీంద్ర జడేజాకు రెండో స్పిన్నర్ గా స్థానం దక్కే అవకాశం కనిపిస్తుంది.

తొలి వన్డే ఆడే అవకాశం ఉన్న భారత ఆటగాళ్లు:
రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శివమ్ దూబే,రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్,మహ్మద్ షమీ,జస్‌ప్రీత్ బుమ్రా, నవదీప్ సైని

Show comments