టాలీవుడ్ లో సమంత – నాగచైతన్య విడాకుల వ్యవహారం ఎంత హాట్ టాపిక్గా మారిందో బాలీవుడ్లో షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన వ్యవహారం కూడా అంతే హాట్ టాపిక్ గా మారింది. కొద్ది రోజుల క్రితం ముంబై నుండి గోవా వెళుతున్న ఒక భారీ క్రూయిజ్ లో డ్రగ్స్ పార్టీ జరగబోతోంది అనే సమాచారం అందుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు కస్టమర్ల రూపంలో క్రూయిజ్ లోకి అడుగుపెట్టారు. డ్రగ్స్ వాడుతున్నట్లు ఖరారు చేసుకున్న తర్వాత సుమారు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని మళ్ళీ క్రూయిజ్ నీ ముంబై తీరానికి ని తీసుకొచ్చి వారిని అరెస్టు చేశారు. నిజానికి ఈ కేసులో షారుక్ ఖాన్ కుమారుడు అరెస్ట్ కావడంతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బాలీవుడ్ అంతా ఇప్పుడు షారుక్ కు అండగా నిలబడి ధైర్యం చెబుతోంది. అయితే ఆర్యన్ సహా పలువురు నిందితులకు ఇటీవల కోర్టు విధించిన కస్టడీ ఈ రోజుతో ముగియడంతో అధికారులు గురువారం నాడు వీరందరినీ ముంబై సిటీ కోర్టులో హాజరు పరిచారు.
ఈ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ కస్టడీ పొడిగించాలని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలోనే తమకు 11వ తేదీ వరకు ఆర్యన్ ఖాన్ సహా అర్బాజ్ అలాగే మున్మున్ రిమాండ్ పొడిగించాలని ఎన్సీబీ తరఫున వారి న్యాయవాదులు కోరారు. అయితే దానికి నిరాకరించిన ముంబై కోర్టు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తయారు చేసి రిమాండ్ రిపోర్ట్ తప్పుల తడకగా ఉందని పేర్కొంది. అలా పేర్కొంటూ ఆర్యన్ ఖాన్ సహా మిగతా వారిని జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ తీర్పు వెలువరించింది. ఇక ఈ కేసులో రంగంలోకి దిగిన సీనియర్ క్రిమినల్ లాయర్ సతీష్ మానేషిండే బెయిల్ కోసం మళ్లీ ప్రయత్నాలు చేపట్టారు. రేపు ఉదయం ఇంటెరిమ్ బెయిల్ పిటిషన్ విచారణకు రాబోతోంది. సతీష్ ట్రాక్ రికార్డ్ చూస్తే రేపే బెయిల్ వచ్చినా రావచ్చని అంటున్నారు.
అయితే కరోనా టెస్ట్ చేసిన తర్వాత నెగిటివ్ రిపోర్ట్ వస్తేనే వారిని జైలుకు తరలించాలని నిబంధనలు ఉన్న కారణంగా ఈరోజు రాత్రి ఆర్యన్ ఖాన్ బ్యూరో ఆఫీస్ లోనే ఉండనున్నారు. మేజిస్ట్రేట్ ఆదేశాల ప్రకారం ఆర్యన్ ఖాన్ కుటుంబ సభ్యులు ఆయనను కలిసే అవకాశం కూడా కల్పించారు. ఇక కోర్టులో ఈ తీర్పు వెలువరిస్తూ ఉన్న సమయంలో షారుక్ ఖాన్ మేనేజర్ పూజ కూడా అక్కడే ఉన్నారు. అయితే 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించమని పేర్కొనడంతో పూజ కోర్టులోనే ఏడవడం కనిపించింది. ఇక సతీష్ మానేషిండే మేజిస్ట్రేట్ దగ్గర ఆమె ఆర్యన్ ఖాన్ బంధువు అని చెప్పి పర్మిషన్ తీసుకుని వారు ఇద్దరూ మాట్లాడుకునే ఏర్పాటు చేశారు.
సతీష్ మానేషిండే మామూలోడు కాదు
ఇక ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం రంగంలోకి దిగిన సతీష్ మానేషిండే మామూలోడు కాదు. గతంలో ప్రముఖ లాయర్ రామ్‌జెఠ్మాలనీ వద్ద ఆయన పనిచేశారు. బాలీవుడ్‌కు సంబంధించిన చాలా హైప్రొఫైల్ కేసులను సతీష్ వాదించారు. 1993లో బాంబే బ్లాస్ట్ కేసుకు సంబంధించి సంజయ్ దత్ తరఫున వాదించి బెయిల్ ఇప్పించింది ఆయనే కాగా 2002లో సల్మాన్ ఖాన్‌పై నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసును కూడా సతీషే వాదించారు. ఇవి కాక 1998లో కృష్ణజింకల వేట కేసులో సల్మాన్ తరఫున వాదనలు వినిపించి ఆయననని బయట పడేశారు. ఇటీవల కూడా సుశాంత్ కేసులో రియా చక్రవర్తి తరపున వాదించిన సతీష్ ఇప్పుడు ఆర్యన్ ఖాన్ ను రక్షించే బాధ్యతలను తీసుకున్నారు.
Also Read : తమన్నా స్థానంలో రంగమ్మత్త గెలిచేనా