Idream media
Idream media
తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీకి దూరంగా ఉన్న నాయకులను దగ్గర చేసుకోవడానికి తీవ్రస్థాయిలో కష్టపడుతున్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. పార్టీ అధికారంలోకి రావాలి అంటే ప్రతి ఒక్కరి సహకారం అవసరం ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు వేస్తున్న అడుగులు ఇప్పుడు పార్టీ నాయకులను కాస్త ఆశ్చర్య పరుస్తున్నాయి. రాజకీయంగా పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో కొంతమంది నాయకులను దగ్గర చేసుకోవడానికి, గతంలో దూరం పెట్టిన వాళ్లను మరింతగా దగ్గర చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో కష్టపడుతూ పార్టీలో పదవులు ఇస్తున్నారు.
దాదాపుగా ఏడాది నుంచి తెలుగుదేశం పార్టీ కమిటీలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తూ తెలుగు యువత సహా పలు విభాగాలకు పదవులను ప్రకటిస్తూ వస్తోంది. రాష్ట్ర కమిటీ అలాగే జాతీయ కమిటీ లో పదవులను టిడిపి అధిష్ఠానం ప్రకటించి పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకు గుర్తింపు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. అదే విధంగా సోషల్ మీడియాలో కష్టపడే వాళ్లకు కూడా ఐ టీడీపీ పేరుతో కొన్ని పదవులను పార్టీ అధిష్టానం ఇచ్చింది. ఇక ఇప్పుడు పోలిట్ బ్యూరో నీ కూడా బలోపేతం చేసే దిశగా పార్టీ అడుగులు వేస్తోంది.
పార్టీ దశ దిశను నిర్దేశించే పోలిట్బ్యూరోలో కీలక నాయకులను ఎంపిక చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ కు పోలిట్ బ్యూరో సభ్యుడిగా అవకాశం కల్పించింది పార్టీ అధిష్టానం. మండలి చైర్మన్ పదవి కోల్పోయిన తర్వాత పార్టీకి దూరంగా ఉన్న షరీఫ్ ఇటీవల పార్టీలో మళ్లీ తన క్రియాశీలకంగా మారతానని చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చే విధంగా తన సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. అదే విధంగా జిల్లాలో ఉన్న నాయకులను కలుపుకుని వెళ్లే విధంగా పని చేస్తానంటూ కూడా షరీఫ్ ప్రకటించారు.
ఈ నేపథ్యంలో షరీఫ్ పార్టీ అధిష్టానం మరోసారి పెద్ద బాధ్యతను అప్పగించింది. మైనారిటీలను దగ్గర చేసుకునేందుకు షరీఫ్ లాంటి నాయకుడిని ముందునుంచి పార్టీ అధిష్టానం కాస్త దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తూనే ఉంది. అదేవిధంగా కొన్ని కొన్ని స్థానిక పదవులను కూడా పార్టీ అధిష్టానం నిన్న ప్రకటించింది. పార్టీ రాష్ట్ర కమిటీ లో 48 మందికి చోటు కల్పించారు. వీరిలో ఇద్దరు ఉపాధ్యక్షులు ఒక అధికార ప్రతినిధి అలాగే 11 మంది ఆర్గనైజింగ్ కార్యదర్శులు 24 మంది కార్యదర్శులు ఉన్నారు. మానవ వనరుల విభాగం చైర్మన్ గా రామాంజనేయులు పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఆహ్వాన కమిటీ అలాగే మీడియా కమిటీ లో కూడా ఖాళీలను పార్టీ అధిష్టానం భర్తీ చేసింది.
దీనికి సంబంధించి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పత్రికా ప్రకటన విడుదల చేశారు. గత ఏడాది నుంచి పార్టీ పదవులను ప్రకటిస్తున్న పార్టీ లో చాలా విభాగాలు పనిచేయకపోవడం ఇప్పుడూ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పార్టీ కార్యక్రమాలు నిర్వహించే సమయంలో పార్టీ నాయకత్వం దూరంగా ఉండటం అధినేతను బాగా ఇబ్బంది పెడుతున్న అంశం. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసే విషయంలో కూడా పదవులు తీసుకున్నవాళ్లు సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండటం లేదు. మరి భవిష్యత్ లో అయినా సరే పార్టీకోసం కష్ట పడతారో లేదో చంద్రబాబు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతారో లేదో చూడాలి.
Also Read : TDP – షరీఫ్‌ను ఆ విధంగా సెట్ చేశారు