సీఎం జగన్‌తో డీజీపీ భేటి – ఆంతర్యమేమిటీ..?

ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో డీజీపీ సమావేశమయ్యారు. అమరావతిలోని కొన్ని గ్రామాల్లో జరుగుతున్న నిరసనలు, రాష్ట్రంలో తాజాగా నెలకొన్న పరిస్థితులపై సీఎంకు డీజీపీ నివేదిక ఇచ్చినట్లు సమాచారం.

నిన్న గుంటూరు, విజయవాడ మధ్య కాజా టోల్‌ ప్లాజా వద్ద ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై జరిగిన దాడి జరిగిన విషయం విధితమే. ఆయనతోపాటు మరో ఎమ్మెల్యే అనిల్‌పై కూడా దాడి జరిగింది. ఈ రెండు ఘటలపై డీజీపీ సీఎంకు నివేదిక ఇచ్చారు. దాడి చేసిన నిందితుల గుర్తింపు, అనంతరం తీసుకుంటున్న చర్యలపై సీఎంకు వివరించారని సమాచారం.

Read Also: విరాళాల లెక్క ఎవరు చెబుతారు..? – చంద్రబాబుపై ఆంధ్రజ్యోతి ప్రశ్నల వర్షం

కాగా, అమరావతి రాజధాని ప్రాంతంలో జరుగుతున్న నిరసనలు, శాంతి భద్రతల సమస్యను సృష్టించేలా టీడీపీ చర్యలు, వాటి నివారణకు సీఎం వైఎస్‌ జగన్‌ డీజీపీకి పలు సూచనలు చేశారని సమాచారం.

Show comments