iDreamPost
iDreamPost
తమ హీరోల సినిమాల రిలీజులు అప్ డేట్స్ లేక డల్ గా ఉన్న అక్కినేని అభిమానులను వరసగా పలకరించబోతున్నారు అక్కినేని గ్యాంగ్. ఈ నెల 19న సుమంత్ కపటధారితో ఇది మొదలుకాబోతోంది. అదే రోజు మరో మూడు చిత్రాలతో పోటీ ఉన్నప్పటికీ టీమ్ మాత్రం రిజల్ట్ పట్ల చాలా నమ్మకంగా ఉంది. కన్నడ బ్లాక్ బస్టర్ రీమేక్ గా రూపొందిన ఈ మూవీ మీద ఫాన్స్ కు గట్టి అంచనాలే ఉన్నాయి. ఎల్లుండి నాగార్జున అతిథిగా గ్రాండ్ ఈవెంట్ చేయబోతున్నారు. ఒకవేళ టాక్ కనక పాజిటివ్ వస్తే మిగిలినవాటిని ధీటుగా తట్టుకోవచ్చు. మళ్ళీ రావా తర్వాత ఆ స్థాయి విజయం కోసం సుమంత్ దీని మీదే ఆధారపడుతున్నాడు.
ఇక భారీ అంచనాలతో వస్తున్న నాగ చైతన్య లవ్ స్టోరీ ఏప్రిల్ 16న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. పోటీలో ఇంకెవరు లేకపోవడం ఓపెనింగ్స్ పరంగా బాగా కలిసి వచ్చేలా ఉంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో విడుదలకు టైమింగ్ చాలా ఇంపార్టెంట్. ఉప్పెన లాంటివి ఇలా ప్లాన్ చేసుకునే టాక్ తో సంబంధం లేకుండా కోట్లు కొల్లగొడుతున్నాయి. ఆ లెక్కన చూసుకుంటే లవ్ స్టోరీకి ఫిదా రేంజ్ రిపోర్ట్స్ వచ్చాయంటే మాత్రం రచ్చ ఖాయం. ఇక ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ జూన్ 19 ఆల్రెడీ లాక్ చేసుకుంది కాబట్టి అభిమానుల ఎదురుచూపులు అప్పుడే మొదలయ్యాయి.
అన్నిటికన్నా ముఖ్యంగా నాగార్జున వైల్డ్ డాగ్ సంగతి తేలడం లేదు. ఓటిటి అని ఒకేసారి లేదు థియేటర్ అని మరోసారి ఇలా రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. దేంట్లో అయినా సరే ఇది ఈ వేసవిలోనే రావడం ఖాయం. కాకపోతే డేట్ విషయంలో క్లారిటీ రావాలి అంతే. ఇక సుశాంత్ ఇచట వాహనములు నిలుపరాదు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. విపరీతంగా టైట్ అయిపోయిన సమ్మర్ లో ఇది ఎక్కడ వస్తుందో చూడాలి. టీజర్ అంచనాలు రేపిన మాట వాస్తవం. మొత్తానికి సుమంత్-సుశాంత్- నాగ చైతన్య – అఖిల్ – నాగార్జున అయిదుగురు సమ్మర్ లోపే రావడం ఫిక్స్ అయిపోయింది.