Air Canada Boeing Catches Fire: వీడియో: భయానక ప్రమాదం.. విమానం గాల్లో ఉండగా మంటలు

వీడియో: భయానక ప్రమాదం.. విమానం గాల్లో ఉండగా మంటలు

Flight Accident: ప్రయాణికులతో టేకాఫ్‌ అయిన విమానం గాల్లో ఉండగా మంటలు చెలరేగాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ భయానక ప్రమాదం వివరాలు మీ కోసం..

Flight Accident: ప్రయాణికులతో టేకాఫ్‌ అయిన విమానం గాల్లో ఉండగా మంటలు చెలరేగాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ భయానక ప్రమాదం వివరాలు మీ కోసం..

ఈమధ్యకాలంలో విమాన ప్రమాదాల గురించి తరచుగా వింటూ ఉన్నాం. కొన్ని సార్లు ప్రయాణాలకు ముందే ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటే.. మరికొన్నిసార్లు.. విమానం గాల్లో ఉండగా ప్రమాదం బారిన పడుతుంది. వారంలో కనీసం రెండు, మూడు విమాన ప్రమాదాలైనా వెలుగు చూస్తున్నాయి. మన దేశంలో కూడా తరచుగా విమాన ప్రమాదాలకు సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా మరో భయానక ప్రమాదం వెలుగు చూసింది. ప్రయాణికులుతో ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి.. గాల్లోకి ఎగిరిన విమానంలో అకస్మాత్తుగా ఉన్నట్లుండి మంటలు చెలరేగాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వివరాలు..

ఇక భయానక ప్రమాదం చోటు చేసుకుంది మన దేశంలో కాదు. కెనడాలో. ఎయిర్‌ కెనడా విమానం ఒకటి గాల్లో ఉండగా.. ఉన్నట్లుండి దాన్నుంచి మంటలు వచ్చాయి. అధికారులు అప్రమత్తమవ్వడంతో.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.. ఎవరికి గాయాలు కాలేదు. దాంతో విమానంలో ఉన్న ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన మూడు రోజుల క్రితం జరగ్గా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జూన్‌ 5 అనగా బుధవారం నాడు ఎయిర్‌ కెనడాకు చెందిన బోయింగ్‌ ఏసీ 872 విమానం.. కెనడాలోని టొరంటో పియర్సన్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ అయ్యింది. ఆ సమయంలో విమానంలో కుడివైపు ఇంజిన్‌లో పేలుడు సంభవించింది. దాంతో ఒక్కసారిగా విమానంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పేలుడు జరగ్గానే ముందుగా విమానం రెక్కల దగ్గర మంటలు చెలరేగాయి.

అప్పటికే ప్రమాదాన్ని గమనించిన పైలెట్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో.. 30 నిమిషాల వ్యవధిలోనే విమానాన్ని పియర్సన్‌ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్‌ చేశాడు. దాంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక విమానంలో పేలుడు జరిగి మంటలు అంటుకున్న సమయంలో.. దానిలో ప్యాసింజర్స్‌, సిబ్బంది కలిపి మొత్తంగా సుమారు 400 మంది వరకు ఉన్నట్లు తెలిపారు. అయితే పైలెట్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో.. అందరూ క్షేమంగా బయటపడ్డారు. ఇక ప్రమాదం జరిగిన సమయంలో.. విమానంలోని ఇంధన ట్యాంక్‌ ఫుల్లుగా నింపి ఉంది. మరోపక్క వాతావరణం కూడా సరిగా లేదు.

ఇలాంటి పరిస్థితుల్లో ఏమాత్రం తేడా జరిగిన విమానం బ్లాస్ట్‌ అయ్యేది. దానిలో ఉన్న ప్రయాణికులు అందరూ సజీవ దహనం అయ్యారు. కానీ అదృష్టవశాత్తు పెను ప్రమాదం తప్పింది. అయితే విమానం పారిస్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని.. రన్‌వే పై నుంచి పైకి లేచిన 30 నిమిషాలకే ఇలా అయ్యిందని విమానాశ్రయ సిబ్బంది తెలిపారు. విమానం కెనడా నుంచి బుధవారం రాత్రి 8.46 గంటలకు బయలుదేరింది.

Show comments