Tdp president – అచ్చెన్నాయుడు వార్నింగ్స్

టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గత కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీ నాయకులకు అదే విధంగా కొంతమంది కార్యకర్తలకు వార్నింగ్ ల మీద వార్నింగ్ లు ఇస్తున్నారు. టిడిపి బలహీనంగా ఉన్న సమయంలో కొంత మంది నాయకులను ఆయన హెచ్చరిస్తున్న విధానం క్రమశిక్షణ పేరుతో కొంత మంది కార్యకర్తలను అదుపులోకి పెడుతున్న విధానం అన్నీ కూడా ఆశ్చర్య పరుస్తున్నాయి. రాజకీయంగా టీడీపీ బలహీనంగా ఉండటంతో ఈ వార్నింగ్ లు క్రమంగా పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటున్నాయి అనే అభిప్రాయం చాలా మంది కార్యకర్తలలో వ్యక్తమవుతోంది.

చిన్న దానికి పెద్ద దానికి పత్రికా ప్రకటనలు విడుదల చేస్తూ అచ్చెన్నాయుడు వార్నింగ్ ఇస్తున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న సమయంలో కొంత మంది కార్యకర్తలు పార్టీలో ఉన్న లోపాలను బయటపెడుతూ పార్టీ అధిష్టానం సరి చూసుకోవాల్సిన అవసరం ఉందని సూచనలు సలహాలు ఇస్తున్నారు. అదే విధంగా కొంతమంది పార్టీ కార్యక్రమాల విషయంలో చాలా అసంతృప్తిగా ఉన్న విషయం ఈ మధ్యకాలంలో స్పష్టంగా అర్థమవుతుంది. చాలామంది నాయకులు పార్టీ అవసరమైన సమయంలో బయటకు రాకపోవడాన్ని కార్యకర్తలు చాలావరకు తప్పుబడుతున్నారు.

Also Read : Kapu Corporation – ఎంతో చేసిన టీడీపీని కాపులు ఎందుకు తిరస్కరించారో?

నిరసన కార్యక్రమాలు విషయంలో చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు విఫలం కావడం అదే విధంగా ప్రజల్లోకి వెళ్లే విధంగా కార్యక్రమాలు నిర్వహించ లేకపోవడం రాష్ట్ర ప్రభుత్వాన్ని సమర్థవంతంగా విమర్శించ లేకపోవడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొన్ని నియోజకవర్గాల్లో ఉన్న ఇన్చార్జిల మీద తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. ఇటీవల నిర్వహించిన ఒక కీలక కార్యక్రమంలో కూడా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఇబ్బంది పడే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రవర్తించ లేకపోవడం అదే విధంగా కొంతమంది నాయకులు మాట్లాడుతున్న సమయంలో వాళ్లకు పూర్తిస్థాయిలో సపోర్ట్ చేయకపోవడం ఇబ్బందికరంగా మారిన అంశం.

దీనిపై కొంత మంది టీడీపీ కార్యకర్తలు తమ సోషల్ మీడియా ఖాతాల్లో నాయకత్వంను విమర్శిస్తూ పోస్టులు పెట్టడం టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి సంబంధించి రెండు రోజుల క్రితం ఒక పత్రికా ప్రకటనను పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఆయన విడుదల చేశారు. పార్టీ కార్యక్రమాల పట్ల గానీ పార్టీ నాయకత్వం పట్ల గానీ ధిక్కార స్వరం వినిపిస్తున్న లేదా ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామంటూ కొంత మంది కార్యకర్తలను ఆయన హెచ్చరించడం గమనార్హం.

Also Read :  TDP Ayyanna Patrudu – అయ్యన్నపాత్రుడు ఇక అంతేనా..?

అదే విధంగా కొంతమంది నాయకులు ఇటీవలి కాలంలో కొన్ని నియోజకవర్గాలకు వెళ్లడం పట్ల కూడా అచ్చెన్నాయుడు వార్నింగ్ ఇవ్వడం ఆశ్చర్యపరిచింది. వంగవీటి రాధా గుడివాడ నియోజకవర్గానికి వెళ్లి అక్కడ నాయకులతో సమావేశం అయ్యే క్రమంలో మంత్రి కొడాలి నాని ని అనుకోని సందర్భంలో కలిశారు. దీనిపై ఒక పత్రికా ప్రకటన విడుదల చేసి అచ్చెన్నాయుడు పరోక్షంగా వంగవీటి రాధ కు వార్నింగ్ ఇచ్చారు అనే అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమైంది. దీని పట్ల చాలా మంది కార్యకర్తలలో ఆగ్రహం పెరిగిపోతోంది.

పార్టీ లోపాలను బయటపెట్టిన లేకపోతే ఎవరైనా అనుకోకుండా ఇతర పార్టీల నాయకులను కలిసిన దాన్ని వేరే కోణంలో ఏ విధంగా చూస్తారని పార్టీ కార్యకర్తలకు క్రమశిక్షణ పేరుతో వార్నింగ్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని అసలే కార్యకర్తలు పార్టీ కోసం పని చేయడానికి చాలా నియోజకవర్గాల్లో బయటకు రాని సమయంలో ఇటువంటి హెచ్చరికల ద్వారా అచ్చం నాయుడు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నాయకత్వం లోపాలను బయటపెడితే జీర్ణించుకోలేని ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏమాత్రం పనికిరారని ఆవేదన కొంత మంది కార్యకర్తలతో వ్యక్తమవుతోంది. దీనిపై చంద్రబాబు నాయుడు దృష్టి సారించి అచ్చంనాయుడు ని కంట్రోల్ చేయకపోతే మాత్రం చాలా మంది నాయకులు పార్టీని వీడి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

Also Read : Nara Lokesh – లేఖతో బయట పడిన డొల్లతనం

Show comments