777 ఛార్లీ అరుదైన ఘనత

గత నెల 10న రిలీజైన 777 ఛార్లీ దాన్ని చేసి చూపించింది. ఇరవై అయిదు రోజుల తర్వాత కూడా ఇప్పటికీ 450 సెంటర్లకు పైగా దిగ్విజయంగా ప్రదర్శింపబడుతోందంటే చెప్పుకోదగ్గ రికార్డే.

గత నెల 10న రిలీజైన 777 ఛార్లీ దాన్ని చేసి చూపించింది. ఇరవై అయిదు రోజుల తర్వాత కూడా ఇప్పటికీ 450 సెంటర్లకు పైగా దిగ్విజయంగా ప్రదర్శింపబడుతోందంటే చెప్పుకోదగ్గ రికార్డే.

పెద్ద స్టార్ హీరోల సినిమాలే యావరేజ్ కంటెంట్ తో బాక్సాఫీస్ వద్ద నెట్టుకురాలేకపోతున్న పరిస్థితుల్లో ఒక కుక్కని టైటిల్ రోల్ లో పెట్టి తీసిన మూవీ దేశవ్యాప్తంగా మంచి వసూళ్లను రాబట్టుకోవడం అంటే విశేషమేగా. గత నెల 10న రిలీజైన 777 ఛార్లీ దాన్ని చేసి చూపించింది. ఇరవై అయిదు రోజుల తర్వాత కూడా ఇప్పటికీ 450 సెంటర్లకు పైగా దిగ్విజయంగా ప్రదర్శింపబడుతోందంటే చెప్పుకోదగ్గ రికార్డే.

పెట్ లవర్స్ వి విపరీతంగా ఆకట్టుకున్న ఛార్లీ ఫ్యామిలీ ఆడియన్స్ ని సైతం మెప్పించింది. ఏకంగా కర్ణాటక ముఖ్యమంత్రి దీన్ని చూశాక కన్నీళ్లు పెట్టుకున్నారంటే ఎమోషన్ ఏ స్థాయిలో పండిందో అర్థం చేసుకోవచ్చు. వసూళ్లు పాతిక కోట్లు దాటేశాయని హీరో రక్షిత్ శెట్టి చెప్పడం బట్టి చూస్తే ఒక కన్నడ మూవీకి అందులోనూ కెజిఎఫ్ లాంటి యాక్షన్ జానర్ కాని దానికి ఈ రెస్పాన్స్ రావడం చాలా స్పెషల్.

అదే జూన్ 10న రిలీజైన నాని అంటే సుందరానికి అంచనాలు అందుకోలేక బోల్తా కొట్టడం చూశాం. అంత క్యాస్టింగ్, మైత్రి లాంటి పెద్ద బ్యానర్ ఇవేవి ఉపయోగపడలేదు. టికెట్ కౌంటర్ల వద్ద పోటీలో శునకమే గెలిచింది. వీటికి కేవలం వారం ముందు వచ్చిన విక్రమ్, మేజర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ని తట్టుకుని 777 ఛార్లీ ఇంత అరుదైన ఘనత సాధించడం చూస్తే జంతువులతో మరిన్ని సినిమాలు రావడం ఖాయమే.

Show comments